సూర్య మూవీస్ అనేది పాపులర్ బ్యానర్. ఎఎమ్ రత్నం నిర్మాతగా ఈ బ్యానర్ అనేక మంచి సినిమాలు, భారీ సినిమాలు అందించింది. ఆ తరవాత తరువాత తెలుగులో వెనుకబఢి వుండొచ్చు కానీ తమిళంలో కూడా భారీ సినిమాలు అదించింది. అలాంటి బ్యానర్ పై మళ్లీ సినిమా వస్తోంది. చాలా కాలంగా ఎఎమ్ రత్నం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో ఏఎమ్ రత్నం సినిమా అనేది ఇప్పటికి మెటీరియలైజ్ అయింది.
అయితే సినిమాకు క్లాప్ పడిన తరువాత బయటకు వచ్చిన సంగతి బ్యానర్ మారింది అన్నది. సూర్య మూవీస్ కు బదులు మెగా సూర్య ప్రొడక్షన్స్ అనే కొత్త బ్యానర్ కనిపించింది క్లాప్ బోర్డుపై. దీంతో రకరకాల ఊహాగానాలు. పవన కళ్యాణ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నారా? అన్న అనుమానం. క్రిష్ కు కూడా నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవడం అనే అలవాటు వుంది. అందుకోసం కొత్త బ్యానర్ పెట్టారా? అని మరో డౌట్.
ఇవేమీ కాదు, అని ఎఎమ్ రత్నం సూర్య మూవీస్ కు కొన్ని పాత తలకాయనొప్పులు వున్నాయని, ఈ సినిమా మీద వాటి ప్రభావం పడకుండా, ముందు జాగ్రత్తగా బ్యానర్ మార్చారని మరో మాట వినిపిస్తోంది. మొత్తం మీద కిృష్ -పవన్ సినిమా క్లాప్ పడుతూనే అనుమానాలకు, ఆలోచనలు చోటిచ్చింది.