సరిలేరు నీకెవ్వరు సినిమా హీరోయిన్ రష్మిక ఆశలు ఓ విధంగా అడియాశలు చేసింది. సూపర్ స్టార్ పక్కన సరైన పాత్రగా మిగలకుండాపోయింది. కానీ మైండ్ బ్లాక్ పాటలో రష్మిక చేసిన విన్యాసాలు కానీ, హి ఈజ్ సో క్యూట్ సినిమాలో రష్మిక డ్యాన్స్ లు కానీ వైరల్ అయ్యాయి. కానీ రష్మిక గ్లామర్ మాత్రం అంతగా ఎలివేట్ కాలేదు.
ఇప్పుడు ఈ లోటు తీర్చేలా రెడీ అయింది భీష్మ సినమా. నితిన్ సరసన ఈ సినిమా రష్మిక పూర్తి గ్లామర్ డాల్ మాదిరిగా కనిపిస్తుందట. సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ కలర్ ఫుల్ డ్రెస్ లతో, మూవ్ మెంట్స్ తో రష్మిక చాలా అందంగా కనిపిస్తుందట. ముఖ్యంగా క్లయిమాక్స్ ముందు వచ్చే మాస్ నెంబర్ వాటే వాటే వాటే బ్యూటీ పాటలో రష్మిక అనేక సిగ్నేచర్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేసిందట.
ఈ మూవ్ మెంట్స్ అన్నీ టిక్ టాక్ లాంటి ఫ్లాట్ ఫారమ్స్ మీద వైరల్ అయ్యేలా వుంటాయని తెలుస్తోంది. ఈ పాటను శుక్రవారం బయటకు వదుల్తున్నారు. చిట్టి పొట్టి గౌను దగ్గర నుంచి శారీ వరకు అన్ని రకాల డ్రెస్ ల్లో రష్మిక కనిపించి, కుర్రకారు మతిపోగొట్టేంతగా అందాలు ఆరబోసిందట. భీష్మ సినిమాకు ఈ పాట హైలైట్ అవుతుందని యూనిట్ వర్గాల బోగట్టా.
సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతుంది. స్వరసాగర్ సంగీతం అందించిన ఈ సినిమాకు, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్.