కరోనా టెర్రర్.. భారత్ లో తొలి కేసు నమోదు

భయపడినంతా జరిగింది. భారత్ తో అధికారికంగా తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అతడు ఇటీవలే చైనా నుంచి ఇండియా వచ్చాడు.…

భయపడినంతా జరిగింది. భారత్ తో అధికారికంగా తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళలో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అతడు ఇటీవలే చైనా నుంచి ఇండియా వచ్చాడు. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ఎక్కడైతే పుట్టిందో, వుహాన్ అనే ఆ నగరం నుంచే అతడు భారత్ వచ్చాడు. వుహాన్ యూనివర్సిటీలో అతడు చదువుకుంటున్నాడు.

కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే అతడ్ని ఓ ప్రత్యేక గదికి తరలించారు. ఇన్ఫెక్షన్ సోకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ట్రీట్ మెంట్ నడుస్తోందని కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో చాలా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీంతో ముంబయి, హైదరాబాద్, బెంగళూరుతో పాటు చాలా ప్రాంతాల్లో చైనా నుంచి వచ్చిన వ్యక్తుల్ని పరీక్షించారు. ఈ క్రమంలో కేరళలో కరోనా వైరస్ బయటపడింది.

మరోవైపు కేరళలోని అదే ప్రాంతంలో 400 మంది అనుమానితుల్ని వాళ్ల ఇళ్లలోనే ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అటు ఢిల్లీ, ముంబయిలో కూడా పలు అనుమానిత కేసులపై కేంద్రం ప్రత్యేక దృష్టిపెట్టింది. వాళ్లందరికీ ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో ఇప్పటివరకు 30వేల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు కేరళలో కేసు మాత్రమే అధికారికం.

ఇక చైనా విషయానికొస్తే.. ఆ దేశంతో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. వూహాన్ నగరంతో చుట్టుపక్కల నగరాలకు కనెక్షన్ కట్ చేశారు. ఇక కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న హుబే ప్రాంతాన్ని కూడా అధికారులు అష్టదిగ్బంధనం చేశారు. మృతుల సంఖ్య మరింత పెరగకుండా ఇలా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కరోనా వ్యాధిగ్రస్తుల కోసం కేవలం వారం రోజుల్లో వెయ్యి పడకల తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించింది చైనా ప్రభుత్వం. వైరస్ సోకిన వాళ్లందర్నీ అక్కడికి తరలిస్తోంది

కండిషన్స్ అప్లై

ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా