ప్రేమకథకు ‘నిర్వాణ’ మార్కు ట్విస్ట్

నిన్ను కోరి సినిమాలో ట్రయాంగుల్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు శివ నిర్వాణ. అక్కడొక భగ్న ప్రేమికుడు ఉన్నాడు. ఇక మజిలీలో కూడా ప్రేమకథకు భార్యభర్తల యాంగిల్ ను జోడించాడు. ఇక్కడ…

నిన్ను కోరి సినిమాలో ట్రయాంగుల్ లవ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు శివ నిర్వాణ. అక్కడొక భగ్న ప్రేమికుడు ఉన్నాడు. ఇక మజిలీలో కూడా ప్రేమకథకు భార్యభర్తల యాంగిల్ ను జోడించాడు. ఇక్కడ కూడా ఓ భగ్న ప్రేమికుడు ఉన్నాడు. ఈరోజు శివ నిర్వాణ కొత్త సినిమా లాంఛ్ అయింది. పేరు టక్ జగదీష్. ఇందులో కూడా ఓ భగ్న ప్రేమికుడు ఉన్నాడు.

నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా ఈ రోజు లాంఛనంగా ప్రారంభమైంది. సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ పోస్టర్ వచ్చేసింది. టైటిల్ జస్టిఫికేషన్ సంగతి పక్కనపెడితే, ఈ సినిమాలో కూడా నానిని ఓ యాంగిల్ లో భగ్న ప్రేమికుడిగా చూపించబోతున్నాడు నిర్వాణ. టక్ జగదీష్ లో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ను హీరోయిన్లుగా తీసుకున్నాడు దర్శకుడు. వీళ్లిద్దరి ఎంపిక కాస్త ఆశ్చర్యం కలిగించినప్పటికీ కథకు వీళ్లిద్దరూ కరెక్ట్ గా సరిపోతారని డైరక్టర్ నమ్మకం.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. ఫిబ్రవరి 11 నుంచి పొలాచ్చిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు. నాని కెరీర్ లో జెర్సీ సినిమా ఎంత ఎమోషనల్ గా ఉంటుందో, దాదాపు అంతే ఎమోషనల్ కంటెంట్ తో వస్తోంది టక్ జగదీష్.

ఈ పదేళ్లలో ఇలాంటి లవ్‌స్టోరీ రాలేదనుకుంటున్నా