బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్‌పై సహచర క్రీడాకారిణి గుత్తా జ్వాల పేరుకు తగ్గట్టే నిప్పుకణిక లాంటి ట్వీట్ చేశారు.
‘ఇప్పటి వరకు అర్థంపర్ఠం లేని ఆటే ఆడావనుకున్నాం. కానీ అర్థంపర్థం లేని పార్టీలో కూడా చేరావా’ అంటూ సైనాపై గుత్తా జ్వాల ఘాటైన వ్యంగ్యాస్త్రాలను ట్వీట్ చేశారు. సైనా నెహ్వాల్ తన సోదరితో కలసి బుధవారం ఢిల్లీలో బీజేపీలో చేరిన నేపథ్యంలో జ్వాల తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.
తన ట్వీట్‌తో తోటి క్రీడాకారిణిపై విసిరిన పంజా లాంటి ట్వీట్… ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. జ్వాల ట్వీట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా జ్వాల ట్వీట్‌ను వ్యతిరేకించడం కనిపిస్తోంది. ‘సైనాను, బీజేపీని విమర్శించే ముందు నీ స్థాయి ఏంటో ముందు చూసుకో. నీ సహచర క్రీడాకారిణపై అంత కోపం ఎందుకు? నువ్వు కూడా నీకు నచ్చిన పార్టీలో చేరొచ్చు కదా?’అంటూ నెటిజన్లు గుత్తా జ్వాలకు సూచిస్తున్నారు. అలాగే గుత్తా జ్వాల వ్యక్తిగత జీవితాన్ని కూడా నెటిజన్లు ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు.
అయితే గుత్తా జ్వాల ఏమనుకుందో కానీ, కాసేపటికే తన ట్వీట్‌ను తొలగించారు. అయితే అప్పటికే జ్వాల ట్వీట్ బాగా వైరల్ కావడం గమనార్హం. జ్వాల ట్వీట్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది. అదే వైరల్ అవుతోంది. కానీ ఏమాటకు ఆ మాట చెప్పుకోవాలంటే సామాజిక అంశాలపై స్పందించడంలో గుత్తా జ్వాల తర్వాతే ఏ క్రీడాకారులైనా. మంచో, చెడో…ఎవరిపైనైనా ధైర్యంగా మాట్లాడే ఏకైక క్రీడాకారిణి గుత్తా జ్వాల అంటే అతిశయోక్తి కాదు.