దిల్ రాజు తప్పు చేసారా?

ఈ రోజుల్లో సినిమాలకు ప్రీమియర్లు వేయడం అన్నది నిజంగా మంచి స్ట్రాటజీ. చాలా సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీ వర్క్ అయింది. అవుతుంది కూడా. కానీ కంటెంట్ మీద నూటికి నూరుశాతం నమ్మకం వుంటేనే ఇలాంటి…

ఈ రోజుల్లో సినిమాలకు ప్రీమియర్లు వేయడం అన్నది నిజంగా మంచి స్ట్రాటజీ. చాలా సినిమాలకు ఇలాంటి స్ట్రాటజీ వర్క్ అయింది. అవుతుంది కూడా. కానీ కంటెంట్ మీద నూటికి నూరుశాతం నమ్మకం వుంటేనే ఇలాంటి ప్రయోగాలు చేయాలి. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే సినిమాలు అయితే ఇలా ముందుగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రీమియర్లు చూసి, టాక్ స్ప్రెడ్ చేసేది యూత్ నే.

వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో టాక్ ను వేగంగా స్ప్రెడ్ చేయడానికి వీలవుతుంది. యూత్ కు అంతలా పట్టని సినిమాలు ప్రీమియర్లు వేయకూడదు. ఎందుకంటే నెగిటివ్ స్ప్రెడ్ కావడానికి అవకాశం వుంటుంది.

పైగా ఇక్కడ దిల్ రాజు పట్టించుకోని విషయం మరోటి వుంది. అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. కనీసం పది శాతం అయినా ఆ ఎఫెక్ట్ వుంటుంది. అది పదిశాతం పాజిటివ్ వుంటుంది. పదిశాతం నెగిటివ్ కూడా వుంటుంది. ఫ్యాన్స్ రియాక్షన్ కు లాజిక్ లు వుండవు.

నిన్నటికి నిన్న జనరల్ పబ్లిక్ కు సినిమా వేసారు. కానీ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అంత ఇమ్మీడియటర్ రెస్పాన్స్ కనిపించలేదు. బహుశా యూనిట్ దీని మీద దృష్టి పెట్టి వుండకపోవచ్చు. కానీ నెగిటివిటీ మాత్రం బానే కనిపిస్తోంది. వీటిని డామినేట్ చేస్తూ పాజిటివిటీని స్ఫ్రెడ్ చేయించాల్సిన అవసరం వుంది. లేదూ అంటే తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఓవర్ సీస్ లో దాని ప్రభావం కనిపించే అవకాశం వుంది.