తను కేవలం పనిమనిషిని మాత్రమే అంటున్న హీరో

కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు లారెన్స్ కేవలం సినిమాల్లో నటించడమే కాదు, మంచి పనులు కూడా చేస్తుంటాడు. తను స్థాపించిన ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివించడం, వైద్యం చేయించడం లాంటివి చేస్తుంటాడు. అయితే…

కొరియోగ్రాఫర్ కమ్ దర్శకుడు కమ్ నటుడు లారెన్స్ కేవలం సినిమాల్లో నటించడమే కాదు, మంచి పనులు కూడా చేస్తుంటాడు. తను స్థాపించిన ట్రస్ట్ ద్వారా పిల్లల్ని చదివించడం, వైద్యం చేయించడం లాంటివి చేస్తుంటాడు. అయితే వీటిని తను గొప్పగా ఫీల్ అవ్వనని అంటున్నాడు లారెన్స్. ఈ విషయంలో తను కేవలం దేవుడికి పనిమనిషిని మాత్రమే అని చెబుతున్నాడు.

“నేను ఓ హీరోగా కంటే ఓ మనిషిగా బాగుండాలని అంతా కోరుకుంటున్నారు. నేను కూడా అలానే ఉంటాను. నా వల్ల ఎంత వీలైతే అంత సేవ చేస్తాను. ఓపెన్ హార్ట్ సర్జరీలు, చదువుకు సాయం లాంటివి ఇంకా చేస్తాను. స్టార్టింగ్ లో ఇవన్నీ నేనే చేస్తున్నానని అనుకునేవాడ్ని. ఇవన్నీ దేవుడు చేస్తున్నాడని వయసు పెరిగేకొద్దీ నాకు అర్థమైంది. నన్ను ఓ పనిమనిషిగా పెట్టుకొని దేవుడు ఇవన్నీ నాతో చేయిస్తున్నాడు. నేను కేవలం పనిమనిషిని మాత్రమే. నన్ను ఎంపిక చేసుకున్న ఆ రాఘవేంద్రస్వామికి థ్యాంక్స్.”

సామాజిక కార్యక్రమాలు చేయడానికి అమ్మ తనకు స్ఫూర్తినిచ్చిందని అంటున్నాడు లారెన్స్. “స్క్రీన్ పై హీరోగా చేస్తే మా అమ్మకు నచ్చదు, రియల్ లైఫ్ లో నేను హీరోగా ఉండాలనేది ఆమె కోరిక. సేవ చేయాలనే ఆలోచన కలిగించింది మా అమ్మ.” అంటూ అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

తను అవకాశాల కోసం ఎదురుచూసినప్పుడు, బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడినప్పుడు రజనీకాంత్ అందించిన సాయాన్ని మరిచిపోలేనని, ఆయన తనకు గురువుతో సమానమని చెప్పుకొచ్చాడు. ఈ హీరో నటించిన రుద్రుడు సినిమా 14న రిలీజ్ అవుతోంది.