పవన్ సరసన…ప్రియాంక అరుళ్ మోహన్

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజి. ఈ సినిమా షూట్ ముంబాయిలో మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతోంది. ఈ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  Advertisement గ్యాంగ్ లీడర్ సినిమాతో…

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా ఓజి. ఈ సినిమా షూట్ ముంబాయిలో మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతోంది. ఈ సినిమాకు హీరోయిన్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 

గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ప్రియాంక అరుళ్ మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తరువాత శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసిందీ ఈ అమ్మాయి. ఇప్పుడు తెలుగులో మరోసారి ఎంట్రీ ఇస్తోంది.

రన్ రాజా రన్, సాహు తరువాత దర్శకుడు సుజిత్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా కోసం పవన్ ముఫై రోజులకు పైగా వర్క్ చేస్తారు. ముంబాయిలో స్టార్ట్ అయిన తరువాత సినిమా షూట్ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. డివివి దానయ్య నిర్మించే ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. పవన్ మిత్రుడు త్రివిక్రమ్ కనుసన్నలలో ఈ సినిమా స్క్రిప్ట్ తయారయింది.

వినోదయ సితం రీమేక్, హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లతో సమానంగా ఓజి సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ లో ఓజి సినిమా విడుదలవుతుంది.