గుంటూరులో దారణం.. రక్షకుడే రాక్షసుడిగా మారాడు

చట్టాల్ని, ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే రాక్షసుడిగా మారాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే, తనే కీచకుడిగా మారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గుంటూరులో జరిగిన ఈ ఘటన పోలీస్ వ్యవస్థ సిగ్గుతో…

చట్టాల్ని, ప్రజల్ని కాపాడాల్సిన పోలీసే రాక్షసుడిగా మారాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కితే, తనే కీచకుడిగా మారి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గుంటూరులో జరిగిన ఈ ఘటన పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకునేలా చేసింది.

గుంటూరు రూరల్ కు చెందిన ఓ యువతి డేవిడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. అలా ఏడాది ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ కలిసి, కృష్ణాజిల్లా మోపీదేవిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత డేవిడ్ అసలు రంగు బయటపడింది. సదరు మహిళను వాడుకొని వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని, డేవిడ్ ను అరెస్ట్ చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది సదరు యువతి.

పోలీస్ స్టేషన్ లో మరో అవమానం ఎదురైంది ఆమెకు. డేవిడ్ ను అరెస్ట్ చేస్తానంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన ఎస్సై, ఆ యువతిని లోబరుచుకున్నాడు. కేసు నమోదు చేయకుండా ఆమెను వివిధ ప్రదేశాలకు పిలిపించుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక దశలో యువతి తల్లిని అదే స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ లాడ్జికి రమ్మని బలవంతం చేశాడు.

దీంతో యువతి తీవ్ర మానసిక క్షోభకు గురైంది. ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలీస్ సిబ్బంది పై వచ్చిన ఆరోపణలపై డీఎస్పీ, ఎస్పీ చేత విచారణ చేయించబోతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై, కానిస్టేబుల్ ను ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకోవాల్సిన పోలీసులు, దిశా చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన పోలీసులే ఇలా కీచకులుగా మారడం బాధాకరం.

ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే

నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి