లూసిఫర్ రీమేక్ నుంచి దర్శకుడు వివి వినాయక్ ఆల్ మోస్ట్ తప్పుకున్నట్లే అని వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ రీమేక్ కు ఎవ్వరూ సెట్ కావడం లేదు. ఈ ప్రాజెక్టు అసలు తెలుగులోకి రావడానికి కారణం దర్శకుడు సుకుమార్. ఆయన సలహా మేరకే హీరో రామ్ చరణ్ లూసిఫర్ హక్కులు కొనిపించారని వార్తలు వున్నాయి.
సుకుమార్ చెప్పిన మార్పులు చేర్పులు మెగాస్టార్ కు నచ్చలేదు. దాంతో రామ్ చరణ్ స్వయంగా ఈ ప్రాజెక్టులోకి డైరక్టర్ సుజిత్ ను తీసుకువచ్చారు. కానీ సుజిత్ కూడా తన మార్పులు చేర్పులతో మెగాస్టార్ ను మెప్పించలేకపోయారు. అప్పుడు వివి వినాయక్ పేరు రంగంలోకి వచ్చింది.
ఆయన కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నారని వార్తలు వినవస్తున్నాయి. దీని వెనుక ఓ ఆసక్తికరమైన గ్యాసిప్ వినిపిస్తోంది. లూసిఫర్ ను తెలుగుకు అనుగుణంగా మార్చడం అన్నదే ఇప్పుడు ఏ డైరక్టర్ ముందయినా వున్న టాస్క్. ఇందులో భాగంగా వినాయక్ కొన్ని సీన్లు తయారుచేసి, మెగాస్టార్ కు చెప్పినట్లు బోగట్టా.
ఇవన్నీ ఎంటర్ టైన్ మెంట్ సీన్లే అని తెలుస్తోంది. వినాయక్ తన స్టయిల్ మాస్ కామెడీ సీన్లు తయారు చేసి తీసుకెళ్లారని, అవన్నీ విన్నాక మెగాస్టార్, సింపుల్ గా మరో కథ చేద్దాం, దీన్ని వదిలేయ్ అని చెప్పేసినట్లు తెలుస్తోంది.
తనను కలిసిన వారితో మెగాస్టార్ ఈ విషయం ముచ్చటిస్తూ, లూసిఫర్ కు మార్పులు చేర్పులు చేస్తే అవి మరింత ప్లస్ అయ్యేలా వుండాలి తప్ప, దాని లెవెల్ ను దిగజార్చేలా వుండకూడదని చెప్పినట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. అంటే వినాయక్ చేసిన కామెడీ సీన్లు ఖైదీ నెంబర్ 150లో ఆలి-బ్రహ్మానందం ట్రాక్ టైపులో వున్నాయేమో?