బాహుబలి ప్రభాస్ మరో సినిమా చేయబోతున్నారని వార్తలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత డివివి దానయ్యకు ప్రభాస్ ఓ సినిమా కమిట్ అయినట్లు తెలుస్తోంది.
మిగిలిన వివరాలు ఎలా వున్నా, ఈ సినిమా కమిట్ కావడం వెనుక యాభై కోట్ల సింగిల్ పేమెంట్ వుందన్న వార్తలు టాలీవుడ్ లో గుప్పుమని వినిపిస్తున్నాయి.
100 కోట్ల రెమ్యూనిరేషన్, యాభై కోట్ల అడ్వాన్స్ అనే డీల్ కారణంగానే ప్రభాస్ ఈ సినిమా కమిట్ అయ్యారని టాలీవుడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా లాభాలను నిర్మాత దానయ్య అడ్వాన్స్ లు గా మారుస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా మరో ఇద్దరు టాప్ మెగా హీరోలకు కూడా అడ్వాన్స్ లు అందాయనో? అందబోతున్నాయనో వినిపిస్తోంది.
కరోనా కల్లోలం ఎలా వున్నా, టాలీవుడ్ లో సినిమాల హడావుడి బలంగా వుంది. భారీ రెమ్యూనిరేషన్లు, భారీ అడ్వాన్స్ లు, భారీసినిమాలు. అంతా భారీగానే. యాభై కోట్లు, వంద కోట్లు ఈ రేంజ్ మాటలే వినిపిస్తున్నాయి అన్ని చోట్లా.