టాలీవుడ్ అగ్రహీరో, జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ మరో షాక్ ఇచ్చారు. పెళ్లయిన నటీనటులు విడిపోతే హీరోయిన్ నే తప్పుపడతారంటూ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి మాట్లాడిన వీడియోను రేణు దేశాయ్ ఇన్ స్టాలో పంచుకున్నారు. ఆమె ఎవరో నాకు తెలియదు కానీ మొదటిసారి నా తరుపున మాట్లాడటం విని చాలా ఏచ్చాను. నేను ఏదైనా మాట్లాడితే రాజకీయ పార్టీకి అమ్ముడుపోయానంటారు. ఎన్నికలు వస్తున్నాయంటారు. ఈ వీడియో చూశాక నా బాధ అర్థం చేసుకునేవారు ఉన్నారనే ధైర్యం వచ్చింది అని పోస్టు చేశారు.
ఓ వీడియోలో కృష్ణ కుమారి మాట్లాడుతూ.. సమాజం మహిళపై ఫోకస్ పెడుతోందని, భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే అందరి దృష్టి సదరు మహిళపై ఉంటుంది తప్ప మగాడిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, సమాజంలో చోటు చేసుకుంటున్న ఇలాంటి పరిణామాలు చాలా దారుణం అన్నారు.
పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ఇష్యూ తీసుకొస్తూ జీవితంలో రేణు పడిన కష్టాలు, పవన్ విషయంలో ఆమె చేసిన త్యాగాలను వివరంగా చెప్పింది. పవన్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డని కనేందుకు కూడా ముందుకొచ్చిందని.. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిందని.. అందుకోసమే కోర్టులో ఆ రోజు రేణు దేశాయ్ గనక నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేదని కానీ రేణు పవన్ మర్యాదను కాపాడిందన్నారు.
కాగా పవన్ నుండి విడిపోయిన తర్వాత పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్ వల్ల రేణు దేశాయ్ ఇబ్బందులు పడుతునే ఉంది. పవన్ మూడో పెళ్లి చేసుకున్నప్పటికి ఆయనపై మాత్రం ఒక్కరు కూడా నెగెటివ్ కామెంట్స్ చేయనప్పటికి రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి వార్తలు వస్తేనే రేణు పెళ్లిని తప్పుబడుతూ ట్రోల్ చేయడం చూశాం. రెండు రోజుల క్రితం కూడా అకీరాను మా అన్న తనయుడు అని పవన్ అభిమానులు కామెంట్ చేయడంపై, రేణూ ఆగ్రహం వ్యక్తం చేశారు.