అనిల్ రావిపూడి జెట్ స్పీడ్

ఫాస్ట్ ఫిల్మ్ మేకర్ గా పూరి జ‌గన్నాధ్ ను చెప్పుకుంటారు కానీ అనిల్ రావిపూడి కూడా అదే కోవలోకి వస్తారు. పైగా సక్సెస్ రేట్ ఎక్కువ. క్రిటిక్స్ అప్రియసేషన్ తో సంబంధం లేకుండా కామన్…

ఫాస్ట్ ఫిల్మ్ మేకర్ గా పూరి జ‌గన్నాధ్ ను చెప్పుకుంటారు కానీ అనిల్ రావిపూడి కూడా అదే కోవలోకి వస్తారు. పైగా సక్సెస్ రేట్ ఎక్కువ. క్రిటిక్స్ అప్రియసేషన్ తో సంబంధం లేకుండా కామన్ ఆడియన్ ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. 

మహేష్ బాబు లాంటి స్టార్ తో ఆరు నెలల్లో సినిమా తీసేసారు. గుడ్ అనిపించుకున్నారు. ఇప్పుడు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాను జస్ట్ ఎనిమిది నెలల్లో సినిమా ఫినిష్ చేసారు.

పోనీ ఏదో ఒక భారీ ఇంటి సెట్ వేసి, అందులోకి జనాలను అందరినీ చేర్చి గుడు గుడు గుంచం ఆడించే వ్యవహారం కాదు. దాదాదు 12 భారీ సెట్ లు వేసారు. 24 లొకేషన్లకు వెళ్లారు. స్టార్ట్ కాస్ట్ కూడా గట్టిదే. అసలే శ్రీలీల డేట్ లు దొరకడమే కష్టం. ఆమెనే కీలకపాత్రలోకి తీసుకుని మరీ ఈ ఫీట్ చేసారు.

బాలయ్య సినిమాల్లో కాస్త భారీగా ఖర్చు చేసింది ఈ సినిమాకే. దాదాపు 110 కోట్లు ఖర్చు చేసారు ఈ సినిమాకు. రిటర్న్ కూడా ఆ రేంజ్ లోనే వుంది. అన్నీ కలిపి 120 కోట్ల వరకు మార్కెట్ చేసారు. కానీ ఎటొచ్చీ ముక్కోణపు పోటీలో విడుదలవుతోంది. 

అటు లియో, ఇటు టైగర్ నాగేశ్వరరావు. అటు విజయ్.. ఇటు రవితేజ. కానీ అడ్వాంటేజ్ దసరా సీజన్ అనే చిన్న హోప్. భగవంత్ కేసరి సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి, ఫస్ట్ హాఫ్, సెకెండ్ హాఫ్ లాక్ చేసి రీ రికార్డింగ్ కు కూడా ఇచ్చేసారు.