బ్రో.. ఐ డోంట్ కేర్

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. మీ అనుమానం నిజమే. కాకపోతే ఇది డైలాగ్ కాదు. సినిమా టైటిల్. బాలకృష్ణ, అనీల్ రావిపూడి సినిమాకు ఇదే టైటిల్ పెడదాం అనుకున్నారు. మధ్యలో పవన్ కల్యాణ్…

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. మీ అనుమానం నిజమే. కాకపోతే ఇది డైలాగ్ కాదు. సినిమా టైటిల్. బాలకృష్ణ, అనీల్ రావిపూడి సినిమాకు ఇదే టైటిల్ పెడదాం అనుకున్నారు. మధ్యలో పవన్ కల్యాణ్ బ్రో వచ్చాడు. అయితే అంతకంటే ముందే ఈ టైటిల్ వద్దనుకున్నారు. బాలకృష్ణ లాంటి మాస్ హీరోకు బ్రో అని పెడితే బాగుండదని అంతా ఫీల్ అయ్యారు.

అప్పుడా టైటిల్ ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో ఇప్పుడు అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. ఈరోజు భగవంత్ కేసరి సినిమా నుంచి మరో వీడియో రిలీజైంది. సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటూ ఈ వీడియో విడుదల చేశారు. వీడియో చివర్లో “బ్రో.. ఐ డోంట్ కేర్” అనే డైలాగ్ చెబుతాడు బాలయ్య.

అలా ఈ సినిమాకు ఈ డైలాగ్ నే టైటిల్ గా పెడతారనే ప్రచారం నడిచింది. అయితే బ్రో మిస్సయినా, 'ఐ డోంట్ కేర్' అనేది భగవంత్ కేసరికి ట్యాగ్ లైన్ గా మారింది. ఇంతకీ ఇప్పుడీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారో తెలుసా? షూట్ కంప్లీట్ అయిందనే విషయం చెప్పడంతో పాటు.. తమ సినిమా విడుదల చెప్పిన తేదీకే వస్తుందనే క్లారిటీ ఇవ్వడానికి.

టీమ్ 8 నెలల పాటు పనిచేసి సినిమా షూట్ పూర్తిచేసింది. 24 అద్భుతమైన లొకేషన్లతో పాటు, 12 భారీ సెట్లలో ఈ సినిమాను షూట్ చేశారు. వర్కింగ్ షాట్స్ కాకుండా.. ఇలా వర్కింగ్ విజువల్స్ తో వీడియో విడుదల చేయడం బాగుంది. విజువల్స్ లో హీరో, దర్శకుడు మాత్రమే కాకుండా.. హీరోయిన్లు కాజల్, శ్రీలీలతో పాటు కీలకమైన టెక్నీషియన్స్ అందరికీ చోటిచ్చారు.

సాహు గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి వస్తోంది.