టాలీవుడ్ అగ్రహీరో, జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఆయన మాజీ భార్య రేణూదేశాయ్ షాక్ ఇచ్చారు. అకీరాను మా అన్న తనయుడు అని పవన్ అభిమాని కామెంట్ చేయడంపై, రేణూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవన్‌తో పాటు ఆయన అభిమానులకు ఆమె దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. రేణూ ఆన్సర్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
పవన్‌కల్యాణ్, రేణూ దేశాయ్ పరస్పరం ప్రేమించుకుని 2009లో ఏడడుగులతో వివాహ జీవితాన్ని ప్రారంభించారు. వాళ్లిద్దరి ప్రేమ దాంపత్యానికి తీయని గుర్తుగా అకీరా, ఆద్య అనే పిల్లలు పుట్టారు. మనస్పర్థలతో 2012లో విడాకులు తీసుకున్నారు. అకీరా, ఆద్య తన దగ్గరే ఉంచుకుని రేణూ వారి బాగోగులు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.
రేణూతో విడాకుల తర్వాత పవన్‌కల్యాణ్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. వ్యక్తిగత జీవితాన్ని ఎవరూ ప్రశ్నించజాలరు. ఇదిలా వుండగా ఏప్రిల్ 8న అకీరా పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన ముద్దుల తనయుడు అకీరా పుట్టిన రోజు పురస్కరించుకుని రేణూ ఓ వీడియోని పెట్టారు. ఈ వీడియోపై పవన్ అభిమాని పెట్టిన కామెంట్ రేణూకు ఆగ్రహం తెప్పించింది.
“మేడమ్ ఒక్కసారైనా మా అకీరాని సరిగ్గా చూపించండి. మా అన్న కుమారుడిని చూడాలని మాకెంతో ఆశగా ఉంది” అని పవన్ అభిమాని కామెంట్ చేశారు. మా అకీరా, మా అన్న కుమారుడనే కామెంట్స్‌తో అకీరాకు రేణూదేశాయ్తో సంబంధం లేనట్టు క్రియేట్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
తన కోపాన్ని, నిరసనను వ్యక్తం చేయడానికి రేణూ ఏ మాత్రం వెనుకాడలేదు. అసలు అకీరాతో పవన్‌కు, అభిమానులకు సంబంధం లేదన్నట్టు ఆమె ఘాటు సమాధానం ఇచ్చారు. రేణూ రియాక్షన్ ఏంటంటే…”మీ అన్న కుమారుడా? అకీరా నా అబ్బాయి. మీరు వీరాభిమానులు అయ్యి ఉండొచ్చు. ముందు మాట్లాడేది నేర్చుకోండి” అని తీవ్రస్థాయిలో రేణూ దేశాయ్ కౌంటర్ ఇచ్చారు.
అకీరా తన అబ్బాయి అని చెప్పడం ద్వారా…రేణూ దేశాయ్ కేవలం అభిమానులనే కాదు, పవన్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ఘాటు సమాధానం ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.