సమంత-శర్వానంద్ కీలక పాత్రల్లో నిర్మాత దిల్ రాజు నిర్మించిన సినిమా 'జాను'. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో విడుదల. తమిళలో సెన్సెషనల్ టాక్ తెచ్చుకున్న 96 కు రీమేక్ ఇది. ఏ యూనిట్ అయితే 96 అనే మ్యాజిక్ ను క్రియేట్ చేసిందో, అదే యూనిట్ యాజ్ ఇట్ ఈజ్ గా జాను సినిమాకు పని చేసింది. నటులు, నిర్మాత మారారు. అంతే.
తమిళలో త్రిష కు ఈ సినిమా విపరీతమైన పేరు తెచ్చింది. తెలుగులో ఆ పాత్రను సమంత చేస్తోంది. విజయ్ సేతుపతి చేసిన హీరో పాత్రను శర్వానంద్ చేస్తున్నాడు. విపరీతమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ఇది. రోటీన్ మాస్ మసాలా కాదు. అలా అని క్లాస్ ఫన్ కూడా కాదు. కేవలం ఇద్దరు ప్రేమికుల జ్ఞాపకాలు, భావోద్వేగాలతో నిండిన సినిమా.
ఇప్పుడు ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ప్రైడ్ సినిమా సంస్థ తీసుకుంది. రెండు కోట్ల రూపాయలకు ఓవర్ సీస్ హక్కులు తీసుకున్నట్లు బోగట్టా. ఇలాంటి సినిమాకు విడుదల తరువాత మౌత్ టాక్ బట్టే కలెక్షన్లు వుంటాయి. ఓవర్ సీస్ లో రెండు కోట్లకు కొనడం అంటే మంచి రేటు వచ్చినట్లే నిర్మాత దిల్ రాజుకు. కానీ రికవరీ కావాలి అంటే జనాలకు గట్టిగా పట్టాలి. ఆ మేరకు మౌత్ టాక్ రావాలి. పైగా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఫ్లాట్ ఫార్మ్ ల ఫుణ్యమా అని 96 సినిమాను సబ్ టైటిల్స్ తో మనవాళ్లు కూడా తెగ చూసేసారు.