నా పేరు సూర్య సినిమా రచయిత వక్కంతం వంశీ ఆశలను నిలువునా నీరు కార్చేసింది. చాలా మంది రచయితల మాదిరిగా తాను కూడా ఏస్ డైరక్టర్ అనిపించుకుంటాను అనుకున్న వక్కంతం వంశీ ఆశయలు అడియాసలయ్యాయి. అయితే, ఆ తరవాత కూడా గీతా సంస్థలో, బన్నీతో అనుబంధం కొనసాగుతూనే వుంది. మరో మంచి సబ్జెక్ట్ తో మరో ప్రయత్నం చేయాలని కిందామీదా అవుతూనే వున్నాడు.
ఇలాంటి నేపథ్యంలో హీరో వరుణ్ తేజ్ తో ఓ సినిమా చేయాలనే ప్రయత్నాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు బోగట్టా. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ ప్రయత్నాలకు మరో ఇద్దరు డైరక్టర్లు క్రిష్, సురేందర్ రెడ్డి అడ్డం పడిపోయినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న బాక్సర్ సినిమా తరువాత వక్కంతం వంశీ సినిమా వుంటుందనుకున్నారు.
కానీ ఇప్పుడు ఈ ప్లేస్ లోకి క్రిష్ సినిమా వచ్చింది. అయితే వరుణ్ తేజ్ తో క్రిష్ డైరక్షన్ సినిమా కాదు. సురేందర్ రెడ్డి డైరక్షన్. నిర్మాతలు మాత్రం క్రిష్-సురేందర్ రెడ్డి ఇద్దరూ. వీళ్లతో పాటే క్రిష్ భాగస్వామి కూడా రాజీవ్ రెడ్డి కూడా వుండనే వుంటారు. ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ ఏం చేస్తాడో మరి? అప్పటికి మరెవరు రెడీగా వుంటారో?