ప‌క్క రాష్ట్రాల‌కు ప‌ట్టిన వేమ‌న‌, తెలుగు వారికి ప‌ట్ట‌డే!

అచ్చ తెలుగులో ప‌ద్యాలు రాసి అద్భుత జీవిత స‌త్యాల‌ను తెలిపిన క‌వి యోగి వేమ‌న జంతి ఉత్స‌వాలు ప‌క్క రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌త్యేకించి క‌ర్ణాట‌క‌లో యోగి వేమ‌న జ‌యంతిని ఘ‌నంగా ప్ర‌తియేడులాగే ఈ…

అచ్చ తెలుగులో ప‌ద్యాలు రాసి అద్భుత జీవిత స‌త్యాల‌ను తెలిపిన క‌వి యోగి వేమ‌న జంతి ఉత్స‌వాలు ప‌క్క రాష్ట్రాల్లో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌త్యేకించి క‌ర్ణాట‌క‌లో యోగి వేమ‌న జ‌యంతిని ఘ‌నంగా ప్ర‌తియేడులాగే ఈ సంవ‌త్స‌రం కూడా. కోవిడ్ ఆంక్ష‌ల‌తో ఇంకా ప‌రిమితం కానీ, క‌రోనాకు పూర్వ‌పు రోజుల్లో క‌ర్ణాట‌క‌లో యోగి వేమ‌న జయంతి ఘ‌నంగా జ‌రిగేది. ఆ స్ఫూర్తి అయితే ఇంకా అక్కడ ఉంది. అంతే కాదు..యోగి వేమ‌న పేరుతో విద్యాల‌యాలు, స‌హ‌కార బ్యాంకులు కూడా రాష్ట్రం క‌ర్ణాట‌క‌!

మ‌రి యోగి వేమ‌న క‌న్న‌డ‌వాడు కాదు. రాసింది క‌న్న‌డ‌లో కాదు. కానీ వేమ‌న ఘ‌న‌త‌ను గుర్తించి, ప్రేమిస్తూ ఆయ‌న‌పై గౌర‌వ మ‌ర్యాద‌లు చాటుకుంటున్నారు క‌న్న‌డీగులు. వేమ‌న జ‌యంతి ఉత్స‌వాలు సంద‌ర్భంగా క‌ర్ణాట‌క మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. క‌ర్ణాట‌క‌లోని రెడ్డి సామాజిక‌వ‌ర్గం వేమ‌న‌ను ఓన్ చేసుకుని ఈ ఉత్స‌వాల‌ను ద‌శాబ్దాలుగా నిర్వ‌హిస్తూ ఉంది. బ‌ళ్లారి ప్రాంతంలో పాటు, బెంగ‌ళూరు న‌గ‌రంలో కూడా వేమ‌న జ‌యంతి ఉత్స‌వాలు జ‌రుగుతుంటాయి. యోగి వేమ‌న ఉత్స‌హాల‌ను సంఘాల వాళ్లే నిర్వ‌హిస్తూ ఉన్నా, ప్ర‌భుత్వం కూడా ఈ ఉత్స‌వాల్లో క్ర‌మంగా భాగం అయ్యింది.

కేవ‌లం క‌ర్ణాట‌కే కాదు.. త‌మిళ‌నాడులోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో కూడా యోగి వేమ‌న స్మ‌ర‌ణ ఉంటుంది. కృష్ణ‌గిరి, హోసూరు ప్రాంతాల్లో యోగి వేమ‌న జ‌యంతి ఉత్స‌వాలు జ‌రుగుతాయి ప్ర‌తియేటా. ఈ సంవ‌త్స‌రం కూడా యోగి వేమ‌న జయంతి ఉత్స‌వాలు పొరుగు రాష్ట్రాల్లో జ‌రిగాయి! అయితే.. ఏపీ, తెలంగాణ‌ల్లో మాత్రం యోగి వేమ‌న జ‌యంతి కార్య‌క్ర‌మాలు ఎక్క‌డా చోటు చేసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వేమ‌న ప‌ద్యాల‌ను చిన్న పిల్ల‌ల‌కు నేర్పుతారు తెలుగు వాళ్లు. వేమ‌న ప‌ద్యం లేని తెలుగు వాచ‌కం ఉండ‌దు. అయితే వేమ‌న ను మాత్రం ప్ర‌భుత్వం ఎక్క‌డా అధికారికంగా స్మ‌రించ‌డం కానీ, సంఘాలు ఇన్ వాల్వ్ అయ్యి వేమ‌న జ‌యంతిని జ‌ర‌ప‌డం కానీ ఏపీ, తెలంగాణ‌ల్లో లేదు. ఈ విష‌యంలో క‌న్న‌డనాట‌, త‌మిళ‌నాట ఉన్న తెలుగు వాళ్లే గొప్ప‌గా నిలుస్తున్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి హ‌యాంలో క‌డ‌ప జిల్లాలో విశ్వ విద్యాల‌యం ఏర్ప‌రిచిన‌ప్పుడు దానికి యోగి వేమ‌న‌ యూనివ‌ర్సిటీగా నామ‌క‌ర‌ణం చేశారు. రాయ‌ల‌సీమ‌లోని ప‌లు ప‌ట్ట‌ణాల్లో యోగి వేమ‌న విగ్ర‌హాలు అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తాయి. ఎవ‌రో బ్రిటీష‌ర్ స్వ‌తంత్రానికి పూర్వ‌మే యోగి వేమ‌న ప‌ద్యాల‌ను భ‌ద్ర‌ప‌రిచి తెలుగు వాళ్ల‌కు అందించాడు. అలా బ‌య‌టి వాళ్లకు తెలిసిన వేమ‌న విలువ తెలుగు వాళ్ల‌కు తెలియ‌కుండా పోతోందా!