జ‌గ‌న్ తో పేచీ పెడితే.. ఆయ‌న‌తో ఇంట‌ర్వ్యూ!

జ‌గ‌న్ తో పేచీ పెట్టుకున్న వాళ్లు కానీ, జగ‌న్ దూరం పెట్టిన వారు .. ఇలాంటి వారు అంటే ఆయ‌న‌కు చాలా ప్రీతి. ఇలాంటి వారితో ఇంట‌ర్వ్యూల కోసం త‌న హృద‌యాన్ని ఎప్పుడూ తెరుస్తారాయ‌న‌.…

జ‌గ‌న్ తో పేచీ పెట్టుకున్న వాళ్లు కానీ, జగ‌న్ దూరం పెట్టిన వారు .. ఇలాంటి వారు అంటే ఆయ‌న‌కు చాలా ప్రీతి. ఇలాంటి వారితో ఇంట‌ర్వ్యూల కోసం త‌న హృద‌యాన్ని ఎప్పుడూ తెరుస్తారాయ‌న‌. ఆయ‌నే ఓపెన్ హార్ట్ స‌ర్జ‌న్. వారాంతంలో  రాజ‌కీయ నేత‌ల‌ను, సినిమా వాళ్ల‌ను ఇంట‌ర్వ్యూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో జ‌గ‌న్ అంటే ప‌డ‌ని వారంటే ఆయ‌న‌కు ప‌ర‌మ ప్రీతి. ఇది ఈనాటిది కాదు. ప‌దేళ్లకు ముందు నుంచి ఇలాంటి క‌థే!

వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌ను విమ‌ర్శించిన కాంగ్రెస్ నేత‌ల‌ను ఆయ‌న క‌ళ్ల‌కు అద్దుకుని ఇంట‌ర్వ్యూలు చేశారు. ఓపెన్ హార్ట్ అంటూ వారి హృద‌యాల‌ను తెరిపించారు. అలాంటి వాళ్లు ఈయ‌న ద‌గ్గ‌ర కూర్చుని వైఎస్ ను విమ‌ర్శిస్తూ ఉంటే పండ‌గ చేసుకున్నారు. కొన్నాళ్ల‌కు వైఎస్ పై విమ‌ర్శ‌ల వాన త‌గ్గించారు. జ‌గ‌న్ నే టార్గెట్ గా చేసుకున్నారు.

మ‌రి ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ఇంకో ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో జ‌గ‌న్ ను వ్య‌తిరేకించే వారికి ఈయ‌న వ‌ద్ద గిరాకీ ఏర్ప‌డింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌డం ప్రారంభించిన కోటంరెడ్డి గుండెను ముందుగా తెరిపించారు. ఆ త‌ర్వాత ఆ పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి ఆహ్వానితులు అయ్యారు. 

ఇక స‌స్పెండ్ అయిన మ‌రో ఇద్ద‌రూ కూడా వ‌ర‌స‌లో ఉండ‌వ‌చ్చు! వీరే కాదు.. రాబోయే రోజుల్లో జ‌గ‌న్ వ్య‌తిరేకులకు ఈయ‌న చాలా ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీలే చేయ‌వ‌చ్చు!