హీరోల పుట్టినరోజులు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందే. పదుల సంఖ్యలో కేక్ కటింగులు, అర్థరాత్రి పార్టీలు, విదేశీ పర్యటనలు, క్షేత్రస్థాయిలో రక్తదానాలు, అన్నదానాలు, ఫ్యాన్స్ హంగామా.. ఇలా ఓ రేంజ్ లో ఉంటుంది. దీనికి పూర్తి రివర్స్ లో తన తన పుట్టినరోజు జరుగుతుందంటున్నాడు అఖిల్.
“నాకు బర్త్ డే ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. డబ్బింగ్ ఉంది, సాంగ్ రిహార్సల్స్ ఉన్నాయి. వాటితోనే బర్త్ డే. ప్రతి ఏటా నా పుట్టినరోజు ఇలానే ఉంటుంది. చూసేవాళ్లకు చాలా బోరింగ్ అనిపిస్తుంది. ఐదారుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్లు మాత్రం రాత్రి వచ్చి విశెష్ చెబుతారంతే. అక్కడ కూడా సర్ ప్రైజ్ లు నాకిష్టం ఉండవు. వాళ్లు చెప్పి వస్తారు.”
ఇలా తనది బోరింగ్ పుట్టినరోజు అంటున్నాడు అఖిల్. ఈ ఏడాది అఖిల్ బర్త్ డే ఇలానే జరిగింది, గతేడాది కూడా ఇలానే జరిగిందట. ప్రతి ఏటా ఇదే విధంగా ఉంటుందంట. అయితే ఏజెంట్ సినిమా హిట్టయితే మరోలా ఉంటుందంటున్నాడు అఖిల్.
“ఏజెంట్ సక్సెస్ అయితే మాత్రం ఈసారి బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాను. అందులో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అందర్నీ పిలిచి పార్టీ ఇస్తాను.”
28న ఏజెంట్ థియేటర్లలోకి వస్తోంది. మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్.