ఈ అమ్మాయి గురించి నిజంగానే చెప్పుకోవాలి

సినిమా వాళ్ల మీద సినిమా తీయడం ఇంద్రగంటికి కొత్త కాదు. గతంలో ఇతడు తీసిన సమ్మోహనం అనే సినిమా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పుడు మళ్లీ అదే హీరోతో 'ఆ అమ్మాయి గురించి మీకు…

సినిమా వాళ్ల మీద సినిమా తీయడం ఇంద్రగంటికి కొత్త కాదు. గతంలో ఇతడు తీసిన సమ్మోహనం అనే సినిమా ఈ కోవలోకే వస్తుంది. ఇప్పుడు మళ్లీ అదే హీరోతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా తీస్తున్నాడు ఈ దర్శకుడు. ఇందులో ఓ సినిమా దర్శకుడి కథను చెప్పాడు డైరక్టర్. సమ్మోహనంలో హీరోయిన్ చుట్టూ కథను తిప్పిన దర్శకుడు, ఈసారి ఈ కథను 'దర్శకుడు' అనే పాయింట్ చుట్టూ అల్లుకున్నట్టు కనిపిస్తోంది. ఈరోజు రిలీజైన టీజర్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.

సినిమాలో కమర్షియల్ డైరక్టర్ గా కనిపించాడు సుధీర్ బాబు. ఫార్ములా కథలతో వరుసగా 6 హిట్స్ కొట్టిన ఈ దర్శకుడు, ఎట్టకేలకు తన మనసుకు నచ్చిన ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ తో సినిమా తీయాలనుకుంటాడు. సరిగ్గా అప్పుడే కళ్ల డాక్టర్ కృతిశెట్టిని చూసి ప్రేమలో పడతాడు.

రియల్ లైఫ్ లో కూడా డ్రామా కోరుకునే ఈ దర్శకుడు, డాక్టర్ ను ఎలా ముగ్గులోకి దింపాడు. ఆమెను తన సినిమాలో నటించేలా చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? నటించడానికి ఒప్పుకున్న హీరోయిన్ పెట్టిన ఆ ఒక్క కండిషన్ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ.

ఏమాత్రం మొహమాటపడకుండా, తడబడకుండా టీజర్ లోనే తన కథ ఏంటనేది చెప్పేశాడు ఇంద్రగంటి. దర్శకుడి పాత్రలో సుధీర్ బాబు, డాక్టర్ గా కృతిషెట్టి బాగున్నారు. పీజీ విందా విజువల్స్, వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కవుట్ అయ్యాయి. టీజర్ చూసిన తర్వాత ఈ అమ్మాయి గురించి నిజంగానే చెప్పుకోవాలి అనేలా ఉంది.