దర్శకుడు ఇంద్రగంటి-హీరో సుధీర్ బాబు కాంబినేషన్ లో గతంలో ఓ సినిమా వచ్చింది. సమ్మోహనం అనే ఆ సినిమా లో ఎక్కువగా సినిమా ఫీల్డ్ వ్యవహారాలే వుంటాయి. సినిమా హీరోయిన్ ఓ ఆర్డినరీ అబ్బాయిని ప్రేమించడం. సినిమా షూటింగ్ లు ఇతరత్రా వ్యవహారాలు, ఆ ఫన్ అందులో చోటు చేసుకున్నాయి.
ఇప్పుడు మళ్లీ ఆయన మరో సినిమా అదే కాంబినేషన్ లో చేస్తున్నారు. ఇందులో కూడా సినిమా బ్యాక్ డ్రాప్ నే కనిపిస్తోంది. కమర్షియల్ ఫార్ములా సినిమాలు తీసే దర్శకుడిగా హీరో, అతను వెదికి పట్టుకునే హీరోయిన్ గా హీరోయిన్ కనిపిస్తున్నాయి.
ఈమేరకు ఈ రోజు విడుదల చేసిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా టీజర్ విషయం వెల్లడిస్తోంది. సుధీర్ బాబు సరసన కీర్తిశెట్టి నటించింది సీనియర్ దర్శకుడు విశ్వనాధ్ కు ఓ అలవాటు వుండేది. కుదిరినపుడల్లా సినిమాల్లో కమర్షియల్ సినిమాను, మ్యూజిక్ ను వెటకారం చేయడం. ఇంద్రగంటి కూడా ఈ టీజర్ లో అదే పని చేసారు. కమర్షియల్ రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలను వెటకారం చేస్తూ ఓ డైలాగు, రెండు కట్ షాట్ లు కూడా వేసారు.
వాటిలో ఒకటి రెండేళ్ల క్రితం వచ్చిన అలవైకుంఠపురములో సినిమాను గుర్తు చేయడం విశేషం. మొత్తం మీద ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా టీజర్ కాస్త ఆసక్తికరంగానే వుంది.