Advertisement

Advertisement


Home > Movies - Movie News

శ్రీలీల..ఒకేసారి రెండు చాన్స్ లు

శ్రీలీల..ఒకేసారి రెండు చాన్స్ లు

పెళ్లి సందD సినిమాతో సర్రున దూసుకువచ్చిన హీరోయిన్ శ్రీలీల. కన్నడనాట నుంచి వచ్చిన అచ్చమైన కృష్ణాజిల్లా అమ్మాయి. 

తన చూపులతో, డ్యాన్స్ లతో పెళ్లిసందD సినిమా పాటలను యూ ట్యూబ్ లో వైరల్ చేసేసింది. ఆ వెంటనే చాన్స్ లు వెదుక్కుంటూ వస్తున్నాయి. కానీ రేటు దగ్గర ముందు వెనుకలు అవుతున్నాయి.

రవితేజతో సినిమా చేస్తోంది. ఆ తరువాత సినిమాలు మాత్రం ఇంకా కమిట్ కాలేదు. శ్రీలీల రెమ్యూనిరేషన్ ను 75 లక్షల నుంచి కోటి రూపాయలు కోట్ చేయడమే దానికి కొంత కారణం.

ఇదిలా వుంటే ఇప్పుడు ఒకేసారి రెండు చాన్స్ లు వరించాయి. వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టిల సరసన రెండు సినిమాలకు శ్రీలీలను ఫిక్స్ చేసారు. రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులతో సితార బ్యానర్ లో తయారవుతాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?