దిల్ రాజు బేరం..పవన్ గరం..గరం?

రాజకీయాల కోసం కోట్ల ఆదాయం వదిలేసుకున్నానని, సినిమాలు వదిలేసుకున్నానని, ఎన్నికల టైమ్ లో ప్రవచనాలు చెప్పిన పవన్ మళ్లీ తనంతట తానే ఒట్టు తీసి గట్టున పెట్టి, సినిమాల్లోకి వచ్చేసారు. పైగా అక్కడి తనను…

రాజకీయాల కోసం కోట్ల ఆదాయం వదిలేసుకున్నానని, సినిమాలు వదిలేసుకున్నానని, ఎన్నికల టైమ్ లో ప్రవచనాలు చెప్పిన పవన్ మళ్లీ తనంతట తానే ఒట్టు తీసి గట్టున పెట్టి, సినిమాల్లోకి వచ్చేసారు. పైగా అక్కడి తనను ఎవరో సినిమాలు మానేయమని అడిగినట్లుగా, వాళ్లు వ్యాపారాలు చేయడం లేదా? వీళ్లు వ్యాపారాలు చేయడం లేదా? అంటూ ఎదురుదాడి ప్రారంభించారు.

ఇలాంటి నేపథ్యంలో పింక్ రీమేక్ షూటింగ్ చకచకా జరుగుతోంది. ఫస్ట్ తరువాత వారం రోజుల పాటు క్రిష్ డైరక్షన్  లో చేసే సినిమాకు కూడా డేట్ లు ఇచ్చారట పవన్. అయితే వీలయినంత హడావుడి లేకుండా సైలంట్ గా కానివ్వమని చెప్పడంతో, పైకి ఏమీ హంగామా చేయడం లేదు క్రిష్ అండ్ కో.

ఇదంతా ఇలా వుంటే పింక్ సినిమా రెమ్యూనిరేషన్ విషయంలో కాస్త గడబిడ అవుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ముందుగా త్రివిక్రమ్ రచనా భాగస్వామ్యంతో అనుకున్నారు. అప్పట్లో యాభై కోట్లు పవన్ కు రెమ్యూనిరేషన్ అని అనుకున్నారు.

అయితే ఇప్పుడు దిల్ రాజు ముఫై అయిదు రోజులు షూట్, 35 కోట్లు రెమ్యూనిరేషన్ అనే ప్రతిపాదన తెచ్చారని, హిందీ డబ్బింగ్ రైట్స్ పెద్దగా రావని, అందువల్ల సినిమాకు రెమ్యూనిరేషన్ ఇలా అయితే బాగుంటుందని ఆయన బేరాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీవర్గాల్లో వినిపిస్తోంది. దీంతో ముందు ఒక మాట, తరువాత ఒకమాట అంటారా? అని పవన్ బుస్సమన్నారని ఓ గ్యాసిప్ వినిపిస్తోంది. ఈ డిస్కషన్ సమయంలో పవన్ కోపంతో తన చేతిలోని కప్ విసిరి కొట్టారన్న గ్యాసిప్ కూడా వినిపించడం విశేషం. 

కానీ ఇవి వట్టి వదంతులేనా? ఇందులో ఏమన్నా నిజముందా? అన్నది తెలియదు. ఏమైనా ఈ సినిమాను ఈజీగా వంద కోట్లకు తగ్గకుండా ధియేటర్ నాన్ థియేటర్ మార్కెట్ అయితే చేసుకోవచ్చు. ఆ మాత్రం అవకాశం అయితే వుంటుంది. అందువల్ల పవన్ కు 50 కోట్ల రెమ్యూనిరేషన్ పెద్దగా భారం అయితే కాకపోవచ్చు.

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా