గ్యాంగ్‌స్టర్ దెబ్బ‌తో.. ఖరీదైన కారు కొన్న సల్మాన్ ఖాన్!

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఖరీదైన హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. మన దేశంలో…

గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స‌భ్యుల నుంచి బెదిరింపులు వ‌చ్చిన నేప‌థ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఖరీదైన హై ఎండ్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. మన దేశంలో ఇంకా అందుబాటులోకి రాని నిస్సాన్ పెట్రోల్ ఎస్‌యూవీని విదేశాల నుండి దిగుమ‌తి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపుల నేప‌థ్యంలో ముంబై పోలీసులు కూడా స‌ల్మాన్ ఖాన్ కు అద‌న‌పు భద్ర‌త క‌ల్పిస్తున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్యతో పాటు పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. జైలు నుండి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో సల్మాన్ ఖాన్‌ను చంపేందుకు తాను ప్రయత్నించినట్లు, బెదిరించినట్లు లారెన్స్ అంగీకరించాడు. 

ఇటీవ‌లే ఓ మీడియాతో లారెన్స్ మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని.. కృష్ణ జింకను చంపి త‌మ తెగ‌ను అవ‌మానించాడ‌ని.. త‌మ కులదైవం ఆలయాన్ని దర్శించుకుని.. తమ వారికి క్షమాపణ చెబితే వదిలేస్తామన్నాడు. వరుస బెదిరింపుల దృష్టా స‌ల్మాన్ జాగ్ర‌త‌లు తీసుకుంటూన్నారు.