బిగ్‌బాస్ హౌస్‌లో గడుసు పిల్ల ఎవరని ప్రశ్నిస్తే మొదటగా అరియానా పేరే వినిపిస్తుంది. హౌస్‌లో చలాకీగా ఉంటూ, సందడి చేస్తూ అరియానా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మొదట్లో టీవీ9 దేవితో సన్నిహితంగా మెలిగిన అరియానా ….ఆమె ఎలిమినేషన్ తర్వాత అందరితో కలుపుగోలుగా ఉంటున్నారు.
ఇక బిగ్‌బాస్ రియాల్టీ షోలో అలకలు, ప్రేమలు, గొడవలు, గ్రూపులు సహజమే. ఈ నేపథ్యంలో అవినాష్‌తో అరియానా స్నేహం కాస్తా ప్రత్యేకమే. వాళ్లద్దరి మధ్య స్నేహానికి మించి మరేదో సంబంధం ఉందన్న అనుమానాలు ఇటు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఉన్నాయి.
గత వారం అవినాష్ ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నప్పుడు అరియానా ముఖంలో కంగారు అంతాఇంతా కాదు. అతన్ని పట్టుకుని ప్రామీస్‌లు, ఇతరత్రా అనేకం వాళ్లిద్దరి మధ్య నడిచాయి.
ఈ నేపథ్యంలో ఎపిసోడ్ 69వ రోజు హౌస్‌లో దీపావళి సందడి ఒక రోజు ముందే చోటు చేసుకొంది. ఇదే సందర్భంలో అరియానా, అవినాష్ మధ్య మెహబూబ్ ప్రత్యక్ష సాక్షిగా ఆసక్తికర సంభాషణ జరిగింది.
అరియానా బాగుంటుంది కదా అని అవినాష్ తనదైన స్టైల్లో సంభాషణ మొదలు పెట్టాడు. అయితే నీకు నేను పడనులే అని అరియానా సరదాగా చెబుతారు. ఎప్పటికప్పుడు మాట మార్చడంలో దిట్ట అయిన అవినాస్ అరియానా అన్న మాటలను లైట్ చేసేందుకు యత్నించాడు. “ఏం మట్లాడుతున్నావ్, నీకు అంత సీన్ లేదు, నాకు అంత సీన్ లేదు. ఇద్దరం ఫ్రెండ్స్” అంటూ బాగా నటించాడు.
ఆ సమయంలో అవినాష్ పడుతున్న బాధ చూడలేక “నేను నీకు పడిపోతానులే” అని అరియానా ఓదార్చే యత్నం చేశారు. అప్పుడు అవినాష్ మరింత బెట్టు చేస్తూ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించాడు.
ఇదే సమయంలో అవినాష్‌ను మెహబూబ్ ఉడికించేందుకు ప్రయత్నించాడు. అరియానా పింక్ శారీ వేసుకుందని నువ్వు పింక్ షర్ట్ వేసుకున్నవా అని రెచ్చగొట్టాడు. అయితే షర్ట్ మారుస్తా అని అవినాష్ బిల్డప్ ఇచ్చాడు. మొత్తానికి అవినాష్-అరియానా మధ్య బయటకు చెప్పుకోలేని వ్యవహారం నడుస్తోందనేది నిజం.