ఇందుకే కదా జగన్ ని జనం మనిషి అంటారు

కష్టం విలువ తెలిసినవాడికే సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది. అలాంటి గొప్ప మనసు ఉంది కాబట్టే.. కష్టాల్లో ఉన్నప్పుడే జనానికి సాయం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. దీనికి తాజా…

కష్టం విలువ తెలిసినవాడికే సాయం చేసే గొప్ప మనసు ఉంటుంది. అలాంటి గొప్ప మనసు ఉంది కాబట్టే.. కష్టాల్లో ఉన్నప్పుడే జనానికి సాయం చేయాలన్న గొప్ప సంకల్పంతో ఉన్నారు సీఎం జగన్. దీనికి తాజా ఉదాహరణ వైఎస్సార్ బీమా పరిహారం చెల్లింపు.

ప్రమాదం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ డబ్బులు చేతిలో పడాలంటే సవాలక్ష నిబంధనలు పాటించాలి. ప్రమాదం జరిగితే డెత్ సర్టిఫికెట్ చేతిలో పడనిదే ఎవ్వరూ ఏ పనీ మొదలు పెట్టరు. కళ్ల ముందు భౌతికకాయం కనపడుతున్నా.. సర్టిఫికెట్ ఉంటేనే ఎల్ఐసీ డబ్బులైనా, ఇంకేదైనా చేతికి అందుతాయి. ఈలోగా కుటుంబ పెద్దను కోల్పోయిన బాధితులు పస్తులున్నా పట్టించుకునేవారే ఉండరు. సరిగ్గా ఇక్కడే జగన్ తన ఆపన్నహస్తాన్ని అందిస్తున్నారు.

పెద్ద దిక్కును కోల్పోయి బాధల్లో ఉన్న కుటుంబానికి తొలి రోజే రూ.10వేల రూపాయలు చేతికి అందించేలా వైఎస్సార్ బీమా విధివిధానాలు రూపొందాయి. అంటే ప్రపంచంలో ఏ ఇన్సూరెన్స్ పథకానికి లేని వేగంతో వైఎస్సార్ బీమా సొమ్ము చేతికి అందుతుందన్నమాట.

తక్షణ సాయం అందించేందుకు వీలుగా.. ప్రతి గ్రామ-వార్డు సచివాలయంలో రూ.20 వేలు డిపాజిట్ చేసి ఉంచుతారు. బీమా పథకం లబ్ధిదారులు ఎక్కడైనా ప్రమాదానికి గురైనా, మరణించినా.. ఆ కుటుంబానికి అదే రోజు రూ.10వేలు ఆ డిపాజిట్ నుంచి తీసి ఇస్తారు. ఆ తర్వాత 15 రోజుల్లోగా మిగతా మొత్తం వారి చేతికి అందుతుంది. 

ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 21 రోజుల్లోగా డెత్ క్లెయిమ్ సెటిల్ చేస్తారు. అంటే లబ్ధిదారులు బీమా సొమ్ము కోసం వేచి చూసే అవకాశమే ఉండదన్నమాట. మిగతా ఏ ప్రభుత్వ రంగ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వలేనంత వేగంగా వైఎస్సార్ బీమా సొమ్ము బాధిత కుటుంబానికి అందజేసేందుకు గైడ్ లైన్స్ రూపొందించారు.

చంద్రబాబు హయాంలో కూడా చంద్రన్న బీమా పరిహారం అందించారు కానీ.. ఆ పథకం లబ్ధిదారులు అతి కొద్ది మంది మాత్రమే. అసంఘటిత రంగ కార్మికుల పేరుతో లబ్ధిదారుల్ని బాగా కుదించారు. 

ఇక బీమా పరిహారం అందాలంటే ముందు జన్మభూమి కమిటీ అంగీకరించాలి. ఆ కమిటీ చేయి తడిపితేనే సొమ్ము చేతికందుతుంది. అది కూడా వారం రోజుల తర్వాతే. అంటే ఈలోగా ఆ కుటుంబం ఎన్ని కష్టాలు పడినా ప్రభుత్వం నుంచి సాయం అందేది కాదన్నమాట. పేరుకి బీమా పథకం ఉన్నా కూడా కష్టాల్లో అక్కరకు రాకుండా పోయింది.

దీంతో జగన్ ఈ పథకాన్ని సమూలంగా మార్చివేశారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే పరిహారం అందేలా విధి విధానాలు రూపొందించారు.

తిరుపతిపై కన్నేసిన పవన్