మనోహర్ అలా…వీర్రాజు ఇలా

జనసేన వ్యవహారం చిత్రంగా వుంది. భాజపాతో బంధం వుంది ఇప్పటికే. కానీ తెలుగుదేశంతో కూడా బంధం కావాలని వుంది. కానీ కేవలం తెలుగుదేశంతో తాము కలవడం కాకుండా భాజపాను కూడా కలపాలని వుంది. అదే…

జనసేన వ్యవహారం చిత్రంగా వుంది. భాజపాతో బంధం వుంది ఇప్పటికే. కానీ తెలుగుదేశంతో కూడా బంధం కావాలని వుంది. కానీ కేవలం తెలుగుదేశంతో తాము కలవడం కాకుండా భాజపాను కూడా కలపాలని వుంది. అదే పెద్ద చిక్కుగా మారింది. తేదేపాతో కలవడానికి భాజపాను సన్నద్దం చేయాలని ఎవరి కృషి వారు చేస్తున్నారు.

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆయనేమీ చెప్పకపోయినా, భాజపా వైపు నుంచి క్లారిటీ రాకపొయినా, తేదేపాతో పొత్తు వ్యవహారం డిస్కస్ చేసే వుంటారని వార్తలు వినిపించాయి. పవన్ సచివుడు నాదెండ్ల మనోహర్ కూడా ఇప్పుడు అదే చెప్పారు. తేదేపా పొత్తు వ్యవహారాలు పవన్-నడ్డా మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి అని. కానీ భాజపా లోకల్ ప్రెసిడెంట్ మాత్రం తేదేపాతో పొత్తు సమస్యే లేదు అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటే…ఓట్ల చీలిక వద్దు అనే నెపంతో పవన్ భాజపా-తేదేపాల మధ్య పౌరోహిత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే తాను..తేదేపా..భాజపా విడివిడిగా పోటీ చేయకపోతే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని బలంగా నమ్ముతున్నారన్న మాట. కానీ ఈ పొత్తు ఇష్టంలేని భాజపాను బలవంతంగా ఒప్పించాల్సి వస్తోంది. 

కానీ ఇక్కడ ఎంత సేపూ ఈ బలవంతపు పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ అసలు తమ పార్టీలో జనాలకు తేదేపాతో పొత్తు ఏ మేరకు అంగీకారం అన్నది చూడడం లేదు. అలా అంగీకారం కానపుడు ఓట్ల మార్పిడి అనేది సాధ్యం కాదన్న విషయం గమనించడం లేదు. గమనించకపోవడం కాదు..గమనించడం ఇష్టం లేక.

నిజానికి భాజపాతో పొత్తు కోసం తేదేపా రాయబారం చేయడం లేదు. పవన్ తోనే చేయిస్తోంది. ఆ సంగతి గమనిస్తున్న వారెవరైనా పవన్ ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు..దీని వెనుక మర్మమేమిటి? అన్న అనుమానాలు రాక తప్పవు. అలావచ్చినపుడే ఈ లోపాయికారీ ఒప్పందాలు అనే గ్యాసిప్ లు వినిపించడం ప్రారంభం అవుతుంది.