తోటి పోలీసుల ముందే ఎస్సై ఆత్మహత్య

తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంది. అతడ్ని పరామర్శించడానికి తోటి పోలీసులు వచ్చారు. వాళ్లు ఇంట్లో ఉంటుండగానే ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నారు. జనగామలో జరిగింది ఈ ఘటన. Advertisement…

తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంది. అతడ్ని పరామర్శించడానికి తోటి పోలీసులు వచ్చారు. వాళ్లు ఇంట్లో ఉంటుండగానే ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నారు. జనగామలో జరిగింది ఈ ఘటన.

55 ఏళ్ల కాసర్ల శ్రీనివాస్ దాదాపు 8 ఏళ్లుగా జనగామలో ఎస్సైగా పనిచేస్తున్నారు. భార్య స్వరూప, శ్రీనివాస్ మాత్రమే ఇంట్లో ఉంటారు. మగపిల్లలిద్దరూ హైదరాబాద్ లో ఉగ్యోగం చేస్తున్నారు. కొన్ని రోజులుగా శ్రీనివాస్-స్వరూప గొడవ పడుతున్నారు. ఇద్దరి మధ్య కుటుంబ, ఆర్థిక పరమైన విషయాలపై గొడవలు జరుగుతున్నాయి.

రాత్రి కూడా ఇద్దరూ గొడవపడి పడుకున్నారట. శ్రీనివాస్ ఈరోజు ఉదయం లేచి చూసేసరికి బాత్ రూమ్ లో స్వరూప ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో శ్రీనివాస్ చలించిపోయారు. భార్య మృతదేహం ముందు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాస్ ను ఓదార్చడానికి సాటి పోలీసులంతా వచ్చారు. వీళ్లలో ఏసీపీ, సీఐ కూడా ఉన్నారు.

అందరూ ఇంట్లో ఉంటుండగానే బాత్రూమ్ కు వెళ్లొస్తానంటూ లేచారు శ్రీనివాస్. తనతో పాటు రివాల్వర్ ను వెంట తీసుకెళ్లారు. బాత్ రూమ్ కు వెళ్లిన నిమిషంలోనే రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఏసీపీ, సీఐ ఉంటుండగానే ఈ ఘటన జరిగింది.

పోలీసుల కళ్లముందే, సాటి పోలీస్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు పోలీసుల ఉన్నతాధికారులు. కేసు నమోదుచేసిన పోలీసులు, వాళ్ల పిల్లలకు సమాచారం అందించారు.