పవన్ కల్యాణ్ కాల్షీట్ల కోసం ఎంతోమంది దర్శకనిర్మాతలు వెయిటింగ్. అలాంటి పవన్ కల్యాణ్ ను దిల్ రాజు వద్దనుకున్నారు. దర్శకుడు కోరినప్పటికీ నో చెప్పారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? అదే గేమ్ ఛేంజర్. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్నాడు ఈ సినిమాని.
గేమ్ ఛేంజర్ సబ్జెక్ట్ ను దిల్ రాజుకు వినిపించాడట దర్శకుడు శంకర్. నెరేషన్ మొత్తం పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ ను హీరోగా అనుకుంటున్నానని చెప్పాడు శంకర్. ఎందుకంటే, ఇదొక సోషల్ మెసేజ్ తో వస్తున్న సినిమా అంట. ఇలాంటి సబ్జెక్ట్ లో పవన్ ఉంటే బాగుంటుందనేది శంకర్ ఫీలింగ్.
కానీ శంకర్ అభిప్రాయంతో దిల్ రాజు ఏకీభవించేదంట. పవన్ కల్యాణ్ ను వద్దన్నారంట. పవన్ కంటే రామ్ చరణ్ చేస్తే బాగుంటుందని శంకర్ కు చెప్పి ఒప్పించారట. ఆ తర్వాత చరణ్-శంకర్ మధ్య స్టోరీ డిస్కషన్ కూడా ఏర్పాటుచేసి, ప్రాజెక్టు లాక్ చేశారట దిల్ రాజు.
అలా శంకర్-పవన్ కాంబినేషన్ లో రావాల్సిన గేమ్ ఛేంజర్ సినిమాలోకి రామ్ చరణ్ వచ్చాడు. ఈ ప్రాజెక్టు లాక్ అయిన తర్వాత కూడా పవన్ పేరు వినిపించింది. మూవీలో ఓ కీలకమైన పాత్రలో పవన్ కల్యాణ్ కనిపిస్తాడనే ప్రచారం నడిచింది. ఆ తర్వాత ఆ ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్లిపోయింది.