శివుడిగా ప్రభాస్.. పార్వతిగా నయనతార?

ఇందులో మొదటిది ఫిక్స్. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. రెండోది మాత్రం ఇంకా కన్ ఫర్మ్ అవ్వాల్సి ఉంది. అయితే దాదాపు ఫిక్స్ అయ్యే సూచనలున్నాయి. Advertisement మంచు విష్ణు హీరోగా…

ఇందులో మొదటిది ఫిక్స్. ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ప్రకటించాడు. రెండోది మాత్రం ఇంకా కన్ ఫర్మ్ అవ్వాల్సి ఉంది. అయితే దాదాపు ఫిక్స్ అయ్యే సూచనలున్నాయి.

మంచు విష్ణు హీరోగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది కన్నప్ప ప్రాజెక్టు. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తారు. ఇందులో అన్ని భాషలకు చెందిన సూపర్ స్టార్లు నటిస్తారని గతంలోనే వెల్లడించాడు విష్ణు.

చెప్పినట్టుగానే ఈ ప్రాజెక్టులో ప్రభాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే విషయాన్ని కన్ ఫర్మ్ చేశాడు విష్ణు. తాజా సమాచారం ప్రకారం, కన్నప్పలో శివుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. మరి పార్వతి పాత్ర పోషించేది ఎవరు?

సరిగ్గా ఇక్కడే నయనతార పేరు తెరపైకొచ్చింది. పైగా ఇదేదో మీడియా నుంచి వచ్చిన పుకారు కాదు. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న మధుబాల, ఈ విషయాన్ని బయటపెట్టింది. అయితే మంచు విష్ణు నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

భక్తిరస పాత్రలు పోషించడం ప్రభాస్-నయనతారకు ఇదే తొలిసారి కాదు. ప్రభాస్ రాముడిగా కనిపించాడు. నయనతార ఆల్రెడీ సీతగా కనిపించింది. కాబట్టి ఈసారి శివపార్వతులుగా కనిపించడానికి వీళ్లిద్దరి నుంచి ఎలాంటి అభ్యంతరం ఉండదు. పైగా పెయిర్ కూడా బాగుంటుంది.

ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికే ఓ హీరోయిన్ తప్పుకుంది. మంచు విష్ణు సరసన నుపుర్ సనన్ ను తీసుకున్నారు. డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక ఆమె తప్పుకున్నట్టు విష్ణు ప్రకటించాడు. మరో హీరోయిన్ కోసం వెదుకుతున్న టైమ్ లోనే నయనతార పేరు తెరపైకొచ్చింది. దీంతో విష్ణు సరసన నయనతారను తీసుకుంటున్నారా లేక ప్రభాస్ సరసన పార్వతి పాత్ర కోసం ఆమెను తీసుకుంటున్నారా అనే చర్చ మొదలైంది.