హీరో నిఖిల్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ కు నిఖిల్ భార్య పల్లవి హాజరైంది. ఆ వేడుకలో ఆమె గర్భంతో కనిపించింది. దీంతో నిఖిల్ తండ్రి కాబోతున్నాడంటూ ప్రచారం మొదలైంది. అదే విషయాన్ని ఈరోజు నిర్థారించాడు ఈ హీరో.
కరోనా టైమ్ లో పెళ్లి చేసుకున్నారు నిఖిల్-పల్లవి. వీళ్లది లవ్ మ్యారేజ్. గోవాలో ప్రపోజ్ చేసి మరీ, హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది ఈ జంట. ఆ తర్వాత కలిసి ఓ చిట్ చాట్ కార్యక్రమానికి హాజరైన ఈ కపుల్.. తమ ప్రేమ-పెళ్లికి సంబంధించి ఎన్నో విషయాల్ని బయటపెట్టారు.
అలా వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న నిఖిల్, ఇప్పుడు తన కుటుంబంలోకి మరో సభ్యుడ్ని ఆహ్వానించబోతున్నాడు. తండ్రిని కాబోతున్నాననే విషయాన్ని తన పీఆర్ టీమ్ ద్వారా ప్రకటించాడు.
కార్తికేయ-2 సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ అయ్యాడు ఈ హీరో. అయితే ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయాడు. ప్రస్తుతం స్వయంభూ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కోసం కత్తియుద్ధంలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నాడు. తన కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాడు నిఖిల్.