విజనరీ అని చెప్పుకోవడం కాదు, ఏ ఏ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుసుకుని క్రమపద్ధతిలో వాటిని ప్రోత్సహిస్తూ సమగ్రమైన ప్రగతికి బాటలు వేస్తున్న నాయకుడిగా జగన్ ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
రచయిత వేణుగోపాలరెడ్డి జగన్ పాలన మీద ఒక పుస్తకం రచించారు. దాని పేరు 'జగన్మోహనం అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్' అని పేరు పెట్టారు. సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత గురించి మంత్రి మాట్లాడుతూ జగన్ పాలన గురించి పూర్తిగా అధ్యయనం చేశాకనే ఈ పుస్తకం రచించారు అని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అనేక పాలనాపరమైన సంస్కరణలను జగన్ తీసుకుని వచ్చారని అవన్నీ వివిధ అధ్యాయాలలో చాలా చక్కగా రచయిత వివరించారని అన్నారు. రచయిత వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ తాను ఏపీ అభివృద్ధి గురించి నిశిత పరిశీలన చేశాను అని అన్నారు. జగన్ నాలుగున్నరేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా తీసుకున్న అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలను కూడా పరిశోధించి వాటినే గ్రంధస్తం చేశాను అన్నారు.
ఏపీ ప్రగతి మీద పూర్తి స్పష్టతతో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. ఈ పుస్తకం చదివితే ఏపీ ఎలా అభివృద్ధి చెందుతోంది, భవిష్యత్తు ఏపీ ఎలా ఉండబోతోంది అన్నది అర్ధం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్మోహనం వైసీపీ పాలన అని రచయిత చెప్పినది నూరు శాతం నిజం అని అంటున్నారు.
ఒక యువ ముఖ్యమంత్రి మీద తొలి పర్యాయం అధికారంలోనే సవివరమైన సమాచారంతో పుస్తకం వెలువడడం అంటే నిజంగా గ్రేట్ అనే అంటున్నారు. జగన్ పాలన మేధావులను సైతం మెచ్చుకునేలా చేస్తోంది అని అంటున్నారు.