ఓటు కొట్టు.. స్కూటీ పట్టు

ఎన్నికల హామీలు అవధులు దాటుతున్నాయ్. చదువుకునే 18 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయికి స్కూటీ. ఎంత వినసొంపుగా వుందీ హామీ. ప్రతి మహిళకు బస్ జర్నీ ఫ్రీ. ఇది ఇంకా బాగుంది. కళ్యాణ లక్ష్మి…

ఎన్నికల హామీలు అవధులు దాటుతున్నాయ్. చదువుకునే 18 ఏళ్లు దాటిన ప్రతి అమ్మాయికి స్కూటీ. ఎంత వినసొంపుగా వుందీ హామీ. ప్రతి మహిళకు బస్ జర్నీ ఫ్రీ. ఇది ఇంకా బాగుంది. కళ్యాణ లక్ష్మి పథకాన్ని అటు ఇటు మార్చి లక్ష రూపాయలు, తులం బంగారం. సూపర్ కదా. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలు. 

తెలంగాణ ఎన్నికల కోసం. అయితే ఎంత మందికి అందుతాయి? ఎంత మందికి అందవు అన్నది అయిదేళ్ల తరువాత తెలుస్తుంది.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందరికీ అందలేదు, దళిత బంధు ఇంకా కొంత మందికే అందింది అని ఇప్పుడు ఎలా విమర్శిస్తున్నారో, అయిదేళ్ల తరువాత అలా వుంటుంది. కానీ ప్రస్తుతానికి అయితే వినడానికి మహా రంజుగా వుంది. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ ఎన్నికల కోసం మాంచి తాయిలాల మేనిఫెస్టోను వండి వార్చింది.

దీని ప్రభావం కచ్చితంగా ఎంతో కొంత వుంటుంది.అందులో సందేహం లేదు. ఎందుకంటే 18 దాటిన అమ్మాయిలు అందరికీ స్కూటీ అంటే ఎంత అట్రాక్షన్? పైగా 18 ఏళ్లు దాటిన వారందరికీ ఓటు వుంటుంది కదా. ఓటు కొట్టు.. స్కూటీ పట్టు అనే టైపు నినాదం అన్నమాట.

అయితే అంతంత మాత్రం హామీలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటేనే ఆంధ్రలో నానా యాగీ చేసారు, చేస్తున్నారు. శ్రీలంక అయిపోతోంది అంటూ. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే శ్రీలంకే అవుతుందో, సోమాలియానే అవుతుందో మరి? అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు ఈ హామీలు వర్కవుట్ అయితే రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో ఇంకెన్ని రకాల హామీలు కురుస్తాయో?