ఈమధ్య నాగచైతన్య కొత్త లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. ఏ హీరో అయినా తమ కొత్త సినిమా కోసమే మేకోవర్ అవుతారు. నాగచైతన్య కూడా అందుకే ఇలా కొత్తగా తయారయ్యారు. అయితే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మాత్రం సరదాగా సమాధానం ఇచ్చారు.
ఈమధ్య 6 నెలల పాటు ఖాళీగా ఉన్నాడు నాగచైతన్య. అలా ఖాళీగా ఉండడం వల్ల, పనీపాట లేక ఇలా జుట్టు-గడ్డం పెంచానంటూ జోక్ చేశారు నాగచైతన్య. అయితే ఆ వెంటనే అసలైన సమాధానం కూడా ఇచ్చారు.
చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. మాస్ క్యారెక్టరైజేషన్ తో రాబోతున్న ఆ సినిమా కోసం జుట్టు-గడ్డం పెంచానని చెప్పుకొచ్చాడు చైతూ.
ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా రివీల్ చేశారు ఈ హీరో. చందుమొండేటి సినిమాకు సంబంధించి ఆల్రెడీ గెటప్ లాక్ అయిందంట. ఆ గెటప్ తో ఫస్ట్ లుక్ ఫొటోషూట్ కూడా జరిగిందట. ఫొటోషూట్ చాలా బాగా వచ్చిందని, త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు నాగచైతన్య.
గీతాఆర్ట్స్2 బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో నాగచైతన్య సరసన మరోసారి సాయిపల్లవి హీరోయిన్ గా నటించనుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించి వర్క్ షాప్ నడుస్తోంది. డిసెంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.
మరికొన్ని రోజుల్లో తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నారు నాగచైతన్య. ఆయన బర్త్ డే కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అన్నట్టు ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాస నేర్చుకుంటున్నారు చైతూ.