అతగాడో చిన్న దర్శకుడు. సరైన సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నాడు. ఈలోగా ఓ పెద్ద సినిమాకు కో డైరక్టర్ గా పని చేసాడు. వర్క్ బాగానే వుందని అదే కంపెనీ దగ్గరకు తీసి, రకరకాల బాధ్యతలు అప్పగించింది. కార్పొరేట్ కంపెనీ, డీసెంట్ వ్యవహారం ఇవన్నీ కాస్త వేరుగా వుంటుంది. ఇన్నాళ్లూ బాగానే, డీసెన్సీకి అనుగుణంగానే నడుచుకుంటూ వచ్చాడు సదరు దర్శకుడు.
మొన్నటికి మొన్న దీపావళికి జరిగిన పార్టీ కథను అడ్డం తిప్పినట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా ఈ సంస్థ ఓ మాంచి పార్టీ హోస్ట్ చేసింది. తమ సంస్ధ నిర్మించే సినిమాలకు సంబంధించిన వారదంరినీ పిలిచినట్లు తెలుస్తోంది.
ఈ పార్టీలో అలవాటు వున్న వాళ్లంతా తలో పెగ్ వేసారు. అక్కడ వచ్చింది తకరారు.. ఈ దర్శకుడు కూడా రెండు పెగ్‌లు వేసేసరికి లోపల వున్న ఒరిజినల్ బయటకు వచ్చింది. ఇక ఒకటే మాస్ డ్యాన్స్ లు, గే డ్యాన్స్ లు, ఇలా మొత్తం టాలెంట్ ప్రదర్శించేసాడట.
దీంతో కాస్త పద్దతిగా వుండే మేనేజ్ మెంట్, మనోడి ఒరిజినల్ ఇదా అని తెలిసి ముక్కు మీద వేలేసుకున్నారు. అంతే కాదు ఆ తరువాత అర్జంట్‌గా ఆ దర్శకుడి కేబిన్‌ను ఒక చోట నుంచి మరో చోటికి మార్చేసారట.