తెలుగు నాట ఓ మాస్ మాట వుంది. సుందరానికి తొందరెక్కువ అన్నది ఆ మాట. ఇప్పుడు దాదాపు అలాంటి మాటనే టైటిల్ గా మారుస్తున్నారట దర్శకుడు వివేక్ ఆత్రేయ.
నాని హీరోగా మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు 'అంటే సుందరానికి ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్రోచేవారెవరురా అనే టైటిల్ పెట్టారు వివేక్ ఆత్రేయ. అందువల్ల ఆయన నుంచి ఇలాంటి వెరైటీ టైటిల్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
పైగా ఈ సినిమాకు సబ్జెక్ట్ కూడా అలాంటిదేనని తెలుస్తోంది. హడావుడి ఎక్కువ..విషయం తక్కువ అనే టైపు హీరో అన్న మాట. హీరోకి విషయం లేదు అనుకునే జనం..అలాంటి హీరో వల్లే తనకు ఏదో అయిపోయిదనే హీరోయిన్..ఇలాంటి కన్ ఫ్యూజన్ కమ్ కాస్త అడల్డ్ టచ్ కామెడీ అన్న మాట.
మొత్తానికి నాని కూడా బాలీవుడ్ స్టయిల్ కామెడీ సినిమా చేయాలని డిసైడ్ అయిపోయినట్లుంది. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ సినిమాలు చేస్తున్నాడు. దాని తరువాత ఈ 'అంటే సుందరానికి' సినిమా వుంటుంది.