పిల్లల వ్యక్తిగత విషయాల గురించి ఊరంతా తెలిసిన తర్వాతే ఇంట్లో తెలుస్తుంటాయి. ఇది అన్ని ఊళ్లలో, అన్ని ఇళ్లలో జరుగు తున్నదే. పిల్లలపై మమకారం వల్ల వాళ్ల గురించి నెగిటివ్‌గా జరుగుతున్న ప్రచారాన్ని ఒక పట్టాన నమ్మకుండా చేస్తుంది.
బిగ్‌బాస్ కంటెస్టెంట్ దేత్తడి హారిక విషయంలో వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అట్లే పొరపాటు పడ్డారు. నిన్న రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లో హారిక చెప్పిన రహస్యం ఆమె తల్లి, అన్నకు షాక్ ఇచ్చి ఉంటుంది.
బిగ్‌బాస్ రియాల్టీ షో ఎపిసోడ్ ఇప్పటికే సగం రోజులకు పైగా పూర్తి చేసుకొంది. నిన్న రాత్రి బిగ్‌బాస్ తన ఇంటి సభ్యులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తమ జీవితానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించిన వాళ్లకు కుటుంబ సభ్యులు రాసిన ఉత్తరాలు అందజేయడం ఆ ఆఫర్ లక్ష్యం.
ఈ నేపథ్యంలో దేత్తడి హారిక తన వ్యక్తిగత జీవితంలో ప్రేమకు సంబంధించిన రహస్యాన్ని చెప్పి …. ముఖ్యంగా తల్లి జ్యోతి, అన్న వంశీకి షాక్ ఇచ్చారు.
దేత్తడి హారిక తన లైఫ్‌లోని రహస్యాన్ని బిగ్‌బాస్ ప్రేక్షకులతో పంచుకున్నారు. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయితో రిలేషన్షిప్ కొనసాగించిన విషయాన్ని వెల్లడించారు.
తన పట్ల అమితమైన జాగ్రత్త ప్రదర్శించడంతో అతని ప్రేమకు ఆకర్షితురాలైనట్టు హారిక చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అలాంటిదేమీ లేదని చెప్పారామె. అయితే ఈ విషయం తన తల్లికి తెలియదని హారిక వెల్లడించారు. దీన్ని రహస్యంగా ఉంచినందుకు క్షమించాలని తల్లిని హారిక వేడుకున్నారు.
అయితే ఇక్కడో విషయం చెప్పుకోవాలి. హారిక తన ఇంటి పేరు దేత్తడితో ఓ యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు. ఈ చానల్లో రెండు రోజుల క్రితం హారిక తల్లి, అన్నతో ఓ జర్నలిస్టు చేసిన ఇంటర్వ్యూ పెట్టారు.
ఈ ఇంటర్వ్యూలో హారిక ప్రేమ విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోందని పరిటాల మూర్తి అనే జర్నలిస్టు ప్రశ్నించగా …అందులో నిజం లేదని హారిక తల్లి కొట్టి పారేశారు.
ఒకవేళ అలాంటిది ఉంటే దాచి పెట్టాల్సిన అవసరం ఏంటని కూడా ఆమె ఎదురు ప్రశ్నించారు. తన కూతురికి ఎప్పుడూ కెరీర్‌పైనే దృష్టి అని చెప్పుకొచ్చారు. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవమని నిన్న రాత్రి బిగ్‌బాస్ హౌస్‌లో హారిక చెప్పిన రహస్యంతో నిరూపితమైంది.