ఆసియాలోనే అపర కుబేరుడు!

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియా ధ‌నవంతుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. ప్రఖ్యాత మేగజీన్ ఫోర్బ్స్ ధ‌న‌వంతుల తాజా జాబితా ప్ర‌కారం 83.4 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అగ్ర‌స్థానంలో చేరారు. అలాగే ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో…

రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీ ఆసియా ధ‌నవంతుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. ప్రఖ్యాత మేగజీన్ ఫోర్బ్స్ ధ‌న‌వంతుల తాజా జాబితా ప్ర‌కారం 83.4 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అగ్ర‌స్థానంలో చేరారు. అలాగే ప్ర‌పంచ ధ‌న‌వంతుల జాబితాలో 9వ స్థానం ద‌క్కించుకున్నారు. ఇదే ఆసియా దేశాల ధ‌న‌వంతుల జాబితాలో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 24వ స్థానానికి ప‌డిపోయారు.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతీయ ధ‌న‌వంతుల్లో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో ఉండగా, గౌతమ్ అదానీ ద్వితీయస్థానంలో ఉన్నారు. హెచ్​సీఎల్ అధినేత శివ్ నాడార్ 3వ స్థానం, సైర‌స్ పూనావాలా 4వ స్థానం, ల‌క్ష్మీ మిట్ట‌ల్ 5వ స్ధానంలో నిలిచారు.

కాగా జనవరి 24 వ‌ర‌కు గౌతమ్ అదానీ ప్రపంచ అత్యంత సంపన్నుల లిస్ట్‌లో మూడో స్థానంలో ఉండ‌గా.. అప్పుడు అతని నికర విలువ 126 బిలియన్‌ డాలర్లు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు త‌ర్వాత అత‌ని సంప‌ద‌ 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం ప్రపంచంలోని 25 మంది ధనికుల మొత్తం సంపద 2100 బిలియన్ డాలర్లు ఉండ‌గా.. 2022లో 2300 బిలియన్ డాలర్లుగా ఉంది. 

గ‌త సంవ‌త్స‌రంతో పోలిస్తే ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ భారత్‌ నుంచి బిలియనీర్ల సంఖ్య పెరిగింది. 2022లో ఈ నంబర్‌ 166 గా ఉండగా ఈ సంవత్సరం 169 కి పెరిగింది. అత్యధిక బిలియనీర్లు అమెరికాలో ఉండ‌గా, త‌రువాత చైనా, భార‌త్ లో ఉన్నారు.