మన హీరోలు చాలడం లేదు

టాలీవుడ్ లో వున్నంత మంది హీరోలు వేరే భాషల్లో లేరు. అయినా మనకు చాలడం లేదు. ఎందుకంటే మనకు అంతకు అంతా నిర్మాతలు కూడా వున్నారు.  Advertisement ఏటా 150 సినిమాలు తీసి విడుదల…

టాలీవుడ్ లో వున్నంత మంది హీరోలు వేరే భాషల్లో లేరు. అయినా మనకు చాలడం లేదు. ఎందుకంటే మనకు అంతకు అంతా నిర్మాతలు కూడా వున్నారు. 

ఏటా 150 సినిమాలు తీసి విడుదల చేయగల సత్తా మన ఇండస్ట్రీకి వుంది. అందుకే మన హీరోలు సరిపోవడం లేదు. మన హీరోలు ఏడాదికి ఒక సినిమా నుంచి మహా అయితే మూడు సినిమాలు చేస్తారు సగటున. అందుకెే పక్క రాష్ట్రాల హీరోల వైపు చూస్తున్నారు. పైగా వాళ్లు కూడా తెలుగు నిర్మాతల వైపు చూస్తున్నారు.

ఇప్పటికే ధనుష్ ఓ స్ట్రయిట్ సినిమా చేసారు. దుల్కర్ చేసారు. ఇదేదో బాగుందని మన జనాలు అటు చూస్తున్నారు. ధనుష్ మళ్లీ మరో సినిమా ఆసియన్ సునీల్-శేఖర్ కమ్ములతో చేస్తున్నారు. అది కాక మళ్లీ సితారలోనే మరో సినిమా చేస్తారు. దుల్కర్ సల్మన్ తో ఓ సినిమా చేయాలని వెంకీ అట్లూరి ప్రయత్నిస్తున్నారు. కార్తీతో ఓ సినిమా చేయాలని పీపుల్స్ మీడియా సంస్థ ప్రయత్నిస్తోంది.

సల్మాన్ తో సినిమా మీద వర్క్ చేస్తున్నారు మైత్రీ మూవీస్ జనాలు. దర్శకుడు చందు మొండేటిని హిందీకి పరిచయం చేయాలని చూస్తున్నారు గీతా సంస్థ అధినేతలు. 

ఇలా మొత్తం మీద అక్కడి హీరోలను ఇక్కడకు తేవడమో, లేదా అక్కడకు వెళ్లి సినిమా చేయడమో అనే పనులు పెట్టుకుంటున్నారు మనవాళ్లు. మన హీరోలు కాస్త స్పీడప్ చేసి, చకచకా సినిమాలు పెంచితే ఈ అవసరం రాదేమో?