మళ్లీ భయపెడుతున్న కరోనా ..!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 4,435 క‌రోనా కేసులు న‌మెద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి పెరిగింది. 163…

దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో దేశ‌వ్యాప్తంగా 4,435 క‌రోనా కేసులు న‌మెద‌య్యాయి. తాజా కేసుల‌తో క‌లిపి ప్ర‌స్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కి పెరిగింది. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గ‌త కొన్ని రోజులుగా 3వేల‌కు పైగా న‌మోద‌వుతూ వ‌స్తోన్న కేసులు తాజాగా 4వేలు దాటడంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ఇక గత 24 గంటల వ్యవధిలో కరోనా కారణంగా కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు. హెచ్3ఎన్2 ఇన్ ఫ్లుయంజా కేసులు వ్యాప్తి చెందడంతో భారత్‌లో గత కొద్దిరోజులుగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 

గత పదిరోజులుగా కొత్త పాజిటివ్ కేసులసంఖ్య భారీగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ వ్యాప్తి పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కేంద్రం సూచించిన ఆదేశాలను పాటించాలని ఆయా రాష్ట్రాలకు సూచించింది.