అచ్చెన్న కంటే ఎర్రన్నకు తొందరెక్కువే?

అదేంటో తమ్ముళ్ళ కంటే ఒక అడుగు ముందుండాలనుకున్నారో ఏమో కానీ ఎర్రన్నలు దూకుడు మీద ఉంటున్నారు. టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందచేయాలంటూ ఇప్పటికే టీడీపీ ఆందోళన చేపట్టిన సంగతి విధితమే. Advertisement సంక్రాంతి పండుగలోగా…

అదేంటో తమ్ముళ్ళ కంటే ఒక అడుగు ముందుండాలనుకున్నారో ఏమో కానీ ఎర్రన్నలు దూకుడు మీద ఉంటున్నారు. టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అందచేయాలంటూ ఇప్పటికే టీడీపీ ఆందోళన చేపట్టిన సంగతి విధితమే.

సంక్రాంతి పండుగలోగా తమ పాలనలో కట్టిన పక్కా  ఇళ్లను లబ్దిదారులకు అందచేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడి హోదాలో అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

ఇపుడు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ దీపావళి లోగా టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు అప్పగించాల్సిందేనని కొత్త డిమాండ్ చేస్తున్నారు. ఆలోగా వారికి ఇవ్వకపోతే మాత్రం తాను తామే దగ్గరుండి మరీ వారిని ఆ ఇళ్లకు తీసుకెళ్ళి గృహ ప్రవేశం చేయిస్తామని కూడా రామక్రిష్ణ చెబుతున్నారు.

అంటే తమ్ముళ్ళు సంక్రాంతి పండుగ అంటే వారితో కలసి ఉద్యమిస్తున్న సీపీఐ ఏకంగా దీపావళి అనేస్తోంది. కానీ ఇది అయ్యేపనేనా అంటే రామక్రిష్ణ మాటల్లోనే కాదు అని కూడా వినిపిస్తోంది.

మౌళిక సదుపాయాలు ఏవీ ఈ టిడ్కో కాలనీలకు లేవని ఆయనే అంటున్నారు. వాటిని పూర్తి చేసి ఇవ్వాలని మరో వైపు కోరుతున్నారు. అంటే ఇప్పట్లో ఇవ్వాలనుకున్నా అసాధ్యం అని తెలిసి మరీ నేడో రేపో ఇళ్ళి ఇచ్చేయండి అనడం రాజకీయం తప్ప మరేమీ కాదు కదా. 

ఇదిలా ఉంటే టిడ్కో ఇళ్ళ విషయంలో భారీ అవినీతి జరిగిందని, విచారణ జరిపిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నారు.  ఆయినా సరే ఈ రాజకీయం ఆగుతుందా.

మన ప్రతాపం అంతా ఆంధ్రలోనే