మ‌హేశ్ మేన‌ల్లుడి కోసం రామ్ చ‌ర‌ణ్ ట్వీట్ల సాయం!

మ‌హేశ్ మేన‌ల్లుడే కాదు.. ఒక ఎంపీ త‌న‌యుడు, ఒక పెద్ద వ్యాపార కుటుంబ వార‌సుడు.. త‌న నేప‌థ్యానికి రాజ‌కీయ‌మో, వ్యాపార రంగ‌మో ఎంచుకుని వార్త‌ల్లో నిల‌వాల్సిన అశోక్ గ‌ల్లా 'హీరో' అయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య…

మ‌హేశ్ మేన‌ల్లుడే కాదు.. ఒక ఎంపీ త‌న‌యుడు, ఒక పెద్ద వ్యాపార కుటుంబ వార‌సుడు.. త‌న నేప‌థ్యానికి రాజ‌కీయ‌మో, వ్యాపార రంగ‌మో ఎంచుకుని వార్త‌ల్లో నిల‌వాల్సిన అశోక్ గ‌ల్లా 'హీరో' అయ్యాడు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా ప‌ట్ల క్రిటిక్స్ మ‌రీ సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు ఏమీ లోనుకాలేదు. బిలో యావ‌రేజ్ స్థాయి రేటింగులే ద‌క్కాయి.

అయితే ఈ సినిమా కోసం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ మాత్రం ట్వీట్ల సాయం చేస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుల స‌మ‌యంలో కూడా రామ్ చ‌ర‌ణ్ ట్వీటేశారు. త‌ను ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజ‌రు కావాల్సింద‌ని, అయితే హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌ల‌ను చెబుతున్న‌ట్టుగా చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు విడుద‌ల‌కు ముందు. ఈ సినిమా అశోక్ గ‌ల్లాకు మంచి కెరీర్ ను ఇస్తుంద‌న్న‌ట్టుగా చ‌ర‌ణ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు.

అయితే ఏదో మొహ‌మాటం కొద్దో, పరిచ‌యాల‌తో ట్వీట్ చేయ‌డమే కాకుండా, సినిమా విడుద‌ల అనంత‌రం కూడా మ‌హేశ్ మేన‌ల్లుడి సినిమా కోసం రామ్ చ‌ర‌ణ్ ఇంకో ట్వీట్ వేశాడు. ఈ సినిమాను వీక్షించాడ‌ట చ‌ర‌ణ్. హీరో త‌న‌ను ఆద్యంతం ఆక‌ట్టుకుంద‌ని రామ్ చ‌ర‌ణ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా యూనిట్ కు అభినంద‌న‌లు తెలిపాడు. అశోక్ గ‌ల్లాది అద్భుత‌మైన ఎంట్రీ అంటూ చ‌ర‌ణ్ త‌న ట్వీట్ లో పేర్కొన్నాడు.

మ‌హేశ్ మేన‌ల్లుడి సినిమా ప‌ట్ల ప్రేక్ష‌క‌లోకం నుంచి వ‌స్తున్న స్పంద‌న ఏమో కానీ, రామ్ చ‌ర‌ణ్ మాత్రం అశోక్ గ‌ల్లాకు ట్వీట్ల సాయం బాగానే చేస్తున్న‌ట్టున్నాడు.