Advertisement

Advertisement


Home > Movies - Movie News

వర్మ..మరీ చీప్ గా అనిపించడం లేదూ?

వర్మ..మరీ చీప్ గా అనిపించడం లేదూ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో గీత దిగిపోయారు. నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు..నా ఇచ్ఛయే కాక నాకేటి వెరపు అన్నట్లు తయారైపోయారు. తన ధోరణికి తన స్టయిల్ లాజిక్ లు తాను చెబుతారు. తాను తానా అంటే తందానా అనే ఒకరిద్దరు న్యూస్ యాంకర్లను పట్టుకుని ఆయన ఏదో విధంగా వార్తల్లో బతికేస్తూ వుంటారు.

వాళ్లు కూడా ఆయన ఇబ్బంది పడేలా ఏమీ ప్రశ్నించరు. న్యూస్ రూమ్ లో రెండు కాళ్లు బూట్లతో సహా టేబుల్ మీద పెట్టి కూర్చున్నా, ఇది పద్దతి కాదు, సరిగ్గా కూర్చోవడం నేర్చుకోండి అని అనరు. అబ్బ..ఎంత వెరైటీగా కూర్చున్నారో అని ఇహి..హి..హి అంటూ నవ్వులు చిందిస్తారు.

తన పబ్లిసిటీ కోసం మొన్నటి వరకు టికెట్ ల ఇస్యూను పట్టుకుని వేలాడిన వర్మ,  ఇప్పుడు మరోసారి మెగా ఫ్యాన్స్ ను కెలకడం మొదలుపెట్టారు. ఆయనకు తెలుసు కదిపితే కందిరీగల తుట్టనే కదపాలని. అప్పుడే జనాల అటెంక్షన్ తనపైకి వస్తుందని. 

మెగా క్యాంప్ లో అల్లు అర్జున్ ఒక్కడే టాప్ స్టార్. ఇప్పడు మిగిలిన వాళ్లంతా అల్లు అర్జున్ బంధువులు అని చెప్పుకోవాల్సిందే అంటూ ట్వీట్ లు మొదలు పెట్టారు. నిజానికి ఇది కొత్త కాదు. గతం కొద్ది వారాలుగా ఆయన బన్నీని ఫోకస్ చేస్తూ, మిగిలిన మెగా హీరోలను టార్గెట్ చేస్తూ ట్వీట్ లు వేస్తూనే వున్నారు.

బన్నీని మెచ్చుకోవడం వర్మ ఆలోచన కాదు. అదే అయితే కేవలం బన్నీని పొగిడి వదిలేయచ్చు. బన్నీ మీదుగా మిగిలిన మెగా హీరోలను చులకన చేయడం ఆయన టార్గెట్. అది చూసి మెగా ఫ్యాన్స్ అంతా ఆయనను తిట్టాలి. ఆయన ట్వీట్ లు వైరల్ కావాలి. అదీ అసలు టార్గెట్. 

ఇలాంటి చీప్ ట్రిక్ లతో వర్మ ఎన్నాళ్లు నెట్టుకొస్తారో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?