లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు చేస్తూ, కథాబలం లేని సినిమాలతో బాక్సాఫీస్ వద్ద జస్ట్ పాస్ అయ్యే సినిమాలు మాత్రం చేస్తోన్న మహేష్‌కి బ్లాక్‌బస్టర్ పడి చాలా కాలమయింది. వచ్చిన మామూలు కమర్షియల్ హిట్లనే బ్లాక్‌బస్టర్లంటూ 'బ్లాక్‌బస్టర్ కా బాప్' అనేస్తున్నారు తప్ప 'శ్రీమంతుడు' తర్వాత మహేష్ నుంచి బ్లాక్‌బస్టర్ రాలేదు.
మిగతా స్టార్ హీరోలంతా తెలుగు సినిమా పరిధి పెంచే సినిమాల పట్ల ఆసక్తి చూపిస్తోన్న నేపథ్యంలో మహేష్ కూడా తన చిరకాల స్వప్నమయిన జేమ్స్‌బాండ్ చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు చూస్తున్నాడు. చాలా మంది దర్శకులకి ఆ తరహా కథ కావాలని చెప్పినా కానీ ఎవరూ మహేష్ ముచ్చట తీర్చలేదింతవరకు.
మహర్షితో మహేష్ మనసు దోచుకున్న వంశీ పైడిపల్లి ప్రస్తుతం అదే పని మీద వున్నాడట. మహేష్‌తో ఏప్రిల్ నుంచి మొదలు పెట్టనున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి జేమ్స్‌బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌నే తీర్చి దిద్దాడట. ఈ చిత్రాన్ని అత్యంత స్టయిలిష్‌గా, హాలీవుడ్ రేంజ్ ప్రొడక్షన్ వేల్యూస్ తెరకెక్కిస్తారట. స్పైడర్‌తో మిస్‌ఫైర్ అయిన మహేష్ ప్రయత్నం ఈసారి క్లిక్ అయితే ఫాన్స్ ఎదురు చూస్తోన్న బ్లాక్‌బస్టర్ కా బాప్ ఇదే కావచ్చు.