సినీ సెలబ్రిటీలు విడిపోవడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇద్దరం మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నట్టు జంటలు ప్రకటించడం ప్యాషనైంది. అంత వరకూ తమది భగ్న ప్రేమ అని, ఆదర్శ జంట అని చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తిదే అని తెలుసుకున్న సగటు అభిమానులు షాక్ తింటున్నారు. విడిపోవడానికి కారణాలేవో ప్రకటించడానికే, తమ ప్రైవసీకి అడ్డు తగలొద్దనే వేడుకోళ్లు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ వైవాహిక బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. ఈ జంట ఎడబాటుపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన మార్క్ ట్వీట్లు చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. పెళ్లికి ఆయన వ్యతిరేకమన్న సంగతి తెలిసిందే. అలాగని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండలేదు. పెళ్లి అనేది ఆయన దృష్టిలో జైలు లాంటిది.
రామ్‌గోపాల్ వర్మ తాజా ట్వీట్స్‌లో పెళ్లిపై వెలబుచ్చిన అభిప్రాయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. వరుస ట్వీట్లలో ఆయన ఏమన్నారంటే…
'పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్ సెట్టర్స్' అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అలాగే 'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంత వరకూ ప్రేమించడం ఉత్తమం', 'స్మార్ట్ పీపుల్ లవ్ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ పేలిపోయే పంచ్‌లు విసిరాడు. అసలే వివాహ బంధానికి వ్యతిరేకి అయిన వర్మకు… సెలబ్రిటీల విడాకులు ఓ పెద్ద ఆయుధం ఇచ్చినట్టైంది. పెళ్లిళ్లను కాకుండా, విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలనేది ఆయన ఫిలాసఫీ.