సగం బాకీ తీర్చేసిన రామ్ చరణ్

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు సల్మాన్ ఖాన్. సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, చిరుతో ఓ డాన్స్ నంబర్ కూడా చేశాడు. ఆ…

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు సల్మాన్ ఖాన్. సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ తో పాటు, చిరుతో ఓ డాన్స్ నంబర్ కూడా చేశాడు. ఆ టైమ్ లో సల్మాన్ కు ఓ రేంజ్ లో కృతజ్ఞతలు చెప్పుకున్నారు చిరంజీవి, రామ్ చరణ్. అయితే సల్మాన్ ఉన్నప్పటికీ, ఆ సినిమాను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. అది వేరే విషయం.

గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటించిన రుణాన్ని కొంచెం తీర్చుకున్నాడు రామ్ చరణ్. సల్మాన్ కొత్త సినిమాలో అతడితో కలిసి స్టెప్పులేశాడు. ఇది కూడా ఓ రకమైన లుంగీ డాన్సే. గతంలో షారూక్ లుంగీ డాన్స్ చేస్తే, ఇప్పుడు సల్మాన్ అదే లుంగీ డాన్స్ ను రిపీట్ చేశాడు.

'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. కథ ప్రకారం ఈ సినిమాలో సౌత్ అప్పీల్ ఎక్కువగా కనిపిస్తోంది. (షారూక్ చేసిన చెన్నై ఎక్స్ ప్రెస్ టైపులో అనుకోవచ్చు). టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

సినిమాకు సంబంధించి సల్మాన్-వెంకీ తో కలిపి ఓ పాట పెట్టారు. అందులో ఇద్దరూ లుంగీ డాన్స్ కట్టారు. ఇందులో ఇలా మెరుపులా వచ్చి అలా డాన్స్ చేసి వెళ్తాడు రామ్ చరణ్. తను కూడా లుంగీ కట్టి సిగ్నేచర్ స్టెప్ వేశాడు.

బాలీవుడ్ సినిమా కాబట్టి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. అందులో చరణ్, స్పెషల్ ఎప్పీయరెన్స్ ఆకట్టుకుంది.

ఇలా గాడ్ ఫాదర్ లో సల్మాన్ నటించిన రుణాన్ని కొంచెం తీర్చుకున్నాడు చరణ్. రామ్ చరణ్ స్పెషల్ ఎప్పీయరెన్స్ తో ఈ సినిమా తెలుగు వెర్షన్ కు మరింత ఊపొస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అన్నట్టు ఈ పాటలో పూజా హెగ్డే కూడా లుంగీ కట్టి చిందులేసింది. అదో కొసమెరుపు.