ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మెక్సికోలో అరెస్ట్!

ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మెక్సికోలో అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో…

ఢిల్లీకి చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకరైన దీపక్ బాక్సర్‌ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సహాయంతో ఢిల్లీ ప్రత్యేక పోలీసు బృందం మెక్సికోలో అరెస్టు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో భారతదేశానికి తీసుకురానున్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌తో దేశం విడిచిపెట్టిన ఢిల్లీ-ఎన్‌సిఆర్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో దీపక్ బాక్సర్‌ ఒకడు.

దీపక్ బాక్సర్ ఆగస్ట్ 2022లో రియల్టర్ అమిత్ గుప్తాను హత్య చేసినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోడ్డుపై బిల్డర్ అమిత్ గుప్తాపై పలుసార్లు కాల్పులు జరిగాయి.  బాక్సర్ గుప్తాను తానే హత్య చేశాడని, హత్యకు కారణం దోపిడీ కాదని, ప్రతీకారమేనని ఫేస్‌బుక్ లో పోస్ట్ కూడా చేశాడు.

జనవరి 29న కోల్‌కతా నుంచి రవి అంటిల్ అనే వ్యక్తి పేరుతో నకిలీ పాస్‌పోర్టు ద్వారా విమానంలో మెక్సికో వెళ్లాడు. దీపక్ బాక్సర్‌పై పోలీసులు రూ. 3 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. అనేక కేసుల్లో దీపక్ నిందితుడిగా ఉన్నాడు. కాగా ఢిల్లీ పోలీసులు భారతదేశం వెలుపల ఒక‌ గ్యాంగ్‌స్టర్‌ను అరెస్టు చేయడం ఇదే తొలిసారి.