‘చైతు .. శోభిత’ డేటింగ్ రూమర్ పై సమంత రియాక్షన్!

శాకుంతలం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చే ఇంట‌ర్వ్యూలలో స‌మంత సినిమా విషయాల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి చెప్పుతోంది. ఇటీవ‌లే త‌న విడాకులు గురించి మాట్లాడిన స‌మంత తాజాగా నాగ చైతన్య…

శాకుంతలం సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇచ్చే ఇంట‌ర్వ్యూలలో స‌మంత సినిమా విషయాల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి చెప్పుతోంది. ఇటీవ‌లే త‌న విడాకులు గురించి మాట్లాడిన స‌మంత తాజాగా నాగ చైతన్య డేటింగ్ పుకార్లపై త‌న స‌న్నిహితుల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది.

నాగ చైతన్య – నటి శోభితా ధూళిపాళ రూమ‌ర్స్ గురించి ఇండైరెక్ట్ మాట్లాడుతూ… ఎవరు ఎవరితో రిలేషన్ షిప్ లో ఉన్నారనే బాధ త‌న‌కు లేదని.. ప్రేమకు విలువ ఇవ్వని వారు ఎంతమందితో కలిసినా కన్నీళ్లే మిగులుతాయని.. కనీసం ఆ అమ్మాయి అయినా సంతోషంగా ఉండాలని. తన ప్రవర్తన మార్చుకుని అమ్మాయిని నొప్పించకుండా చూసుకుంటే అందరికీ మేలు జరుగుతుంది ఆమె త‌న సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. 

కాగా నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత.. అనూహ్యంగా డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సమంతకు సంబంధించిన ప్రతి విషయం జనాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య, శోభిత దూళిపాళ్లతో కలిసి తిర‌గ‌డం గురించి రకరకాల పుకార్లు వ‌స్తున్నాయి.

మన పురాణాల్లోని దుశ్యంతుడు – శాకుంతలం కథ ఆధారంగా గుణశేఖశ్ ద‌ర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ గా తెరకెక్కుతున్న సినిమా శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది.  ఏప్రిల్ 14న తెలుగు,  హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో రిలీజ్ కాబోతుంది.