‘ఏపీ రాజధాని భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఏడు నెలలవుతున్నా ఎందుకు విచారణ చేపట్టలేదు? కేవలం టీడీపీ నేతలపై ఆరోపణలకే ఎందుకు పరిమితం అవుతున్నారు. దమ్ముంటే విచారించి దోషులపై చర్యలు తీసుకోండి. ఎవరికీ అభ్యంతరం లేదు. అంతేకానీ ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో రాజధాని మార్పు మంచిది కాదు’…చంద్రబాబు పదేపదే చెబుతున్న మాట ఇది. ఒక్క చంద్రబాబే కాదు…మిగిలిన ప్రతిపక్షాల భావం కూడా ఇంచుమించు ఇదే.
నిజమే కదా…జగన్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు వేస్తున్న ప్రశ్న కూడా ఇదే. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై న్యాయ విచారణకు అసెంబ్లీలో మూడురోజుల క్రితం తీర్మానించారు. ఆ వెంటనే సీఐడీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. ఇందులో భాగంగా మాజీ మంత్రులు పొంగూరు నారాయణ, పత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక టీడీపీ నేత, వెంకటాయపాళెం మాజీ సర్పంచ్ బెల్లంకొండ నరసింహాపై కేసులు నమోదు చేశారు.
వెంకటాయపాలెంకు చెందిన పోతురాజు బుజ్జి అనే దళిత మహిళను మభ్యపెట్టి తన 99సెంట్ల భూమిని కొనుగోలు చేశారని, దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు వారిపై కేసులు నమోదు చేసినట్టు సీఐడీ ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. అంతే కాదు మాజీ మంత్రులపై ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయని, 797 మంది తెల్ల రేషన్ కార్డుదారులు రూ. 3 కోట్ల చొప్పున భూములు కొనుగొలు చేసినట్లుగా సీఐడీ అధికారులు గుర్తించారు.
మొత్తం రూ. 220 కోట్ల విలువైన భూములను తెల్ల రేషన్ కార్డు కలిగినవారు కొనుగొలు చేసినట్లు గుర్తిచామని మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి ఈ రేషన్ కార్డుదారుల వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు.
అయితే ఇవన్నీ పైకి మామూలు విషయాలుగా కనిపిస్తున్నా….ఏడునెలల తర్వాత ఇప్పుడే విచారణ ప్రారంభం కావడం వెనుక సీఎం జగన్ మాస్టర్ ప్లాన్ ఉంది. తాను అధికారంలోకి వస్తే ఏం చేయాలనే అంశాలపై జగన్‌కు చాలా స్పష్టమైన విజన్ ఉంది. ఇందులో భాగంగా అభివృద్ధి వికేంద్రీకరణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. మూడు రాజధానుల ప్రకటన, దాని పర్యవసానాలను ముందే పసిగట్టిన జగన్…అందుకు తగ్గట్టు ఓ పథకం రచించాడు.
రానున్న రోజుల్లో దర్యాప్తు వేగవంతం కావడం, దానిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ గగ్గోలు పెట్టడం ప్రారంభిస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మీడియా ముందుకొచ్చి తనపై అక్రమ కేసులు బనాయించారని, న్యాయస్థానంలో తేల్చుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో చంద్రబాబు సహా అనేక మంది ప్రముఖుల పేర్లు తెరమీదకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ విచారణపై దుమారం చెలరేగాలని జగన్ భావిస్తున్నారు.
ఇదే సమయంలో రాజధాని ఆందోళన మరుగున పడిపోవాలనేది వైసీపీ సర్కార్ ప్రధాన ఎత్తుగడ. అసెంబ్లీ, శాసనమండలిలో చోటు చేసుకుంటున్న ఘటనల పుణ్యమా అని ఇప్పటికే రాజధాని ఆందోళనల వార్తలకు ప్రాధాన్యం తగ్గింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు రానున్న రోజుల్లో రాజధాని ఆందోళనను తప్పక పక్కదారి పట్టించే అవకాశాలున్నాయి.
సరిగ్గా ఈ సమయంలోనే విచారణకు ఆదేశించడం, వెంటనే దర్యాప్తు మొదలు కావడం చూస్తే జగన్ సర్కార్ ఓ వ్యూహం ప్రకారం ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు జగన్ మాస్టర్ ప్లాన్‌కు రాజధాని రైతుల ఆందోళన మరుగున పడిపోవడం, టీడీపీ దర్యాప్తు చుట్టూ ప్రదక్షిణలు చేయడం జరిగిపోతాయి.
ఈ పప్పు నాయుడి గాడికి రాజకీయా బిక్ష పెట్టిందే రాజశేఖర్ రెడ్డి గారు